ETV Bharat / city

Gulf: గల్ఫ్​లో భారత స్వాతంత్య్ర దినోత్సవాలు.. తెలుగు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహణ - indian independence day celebrations 2021 news

గల్ఫ్ తెలుగు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా భారత స్వాతంత్య్ర వేడుకలను నిర్వహించారు. కువైట్ లో నిర్వహించిన కార్యక్రమానికి అతిథిగా ఆ దేశంలోని భారత రాయభారి సిబీ జార్జి, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్​ నాయుడు, తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి హాజరయ్యారు.

గల్ఫ్​ లో తెలుగు సంఘాల ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

author img

By

Published : Aug 18, 2021, 12:49 PM IST

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను గల్ఫ్​లోని తెలుగు సంఘాలు ఘనంగా నిర్వహించాయి. కువైట్ లో జరిగిన ఈ వేడుకకు తెలుగు సంఘాల ఐక్య వేదిక - కువైట్​ ఆధ్వర్యంలో వర్చవల్​గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో 8 తెలుగు సంఘాల భాగస్వామ్యమయ్యాయి. ముఖ్యఅతిథిగా కువైట్​లోని భారత రాయభారి సిబీ జార్జి హాజరయ్యారు. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్​నాయుడు ప్రత్యేక అతిథిగా.. తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి గౌరవ అతిథిగా హాజరయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

75వ స్వాతంత్య్ర వేడుకలను గల్ఫ్​ దేశాల్లోని తెలుగు సంఘాలు కలిసి చేసుకోవడం సంతోషంగా ఉందని.. తెలుగు సంఘాల ఐక్య వేదిక- కువైట్​ అధ్యక్షుడు కుదరవల్లి సుధాకరరావు తెలిపారు. ఈ కార్యక్రములో భాగస్వాములైన తెలుగు కళాసమితి- బహరైన్, తెలుగు కళా సమితి - ఒమన్, ఆంధ్ర కళావేదిక - ఖతార్, తెలుగు అసోసియేషన్ - సౌదీ అరేబియా, తెలుగు కళాస్రవంతి - అబుదాబి, తెలుగు కుటుంబాలు - ఫుజైరియ, తెలుగు తరంగిణి.. సంఘాలకు ధన్యవాదాలు తెలిపారు.

కష్టకాలంలో ఉన్న సురభి నాటకరంగానికి చేయూతనిచ్చేందుకు.. ప్రతినెల ఒకొక్క తెలుగు సంఘం ఆధ్వర్యంలో నాటక ప్రదర్శన ఏర్పాటుచేసే విధంగా కార్యాచరణ సిద్ధం చేసినట్లు కుదరవల్లి సుధాకరరావు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి వరకు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పారు.

ఇదీ చదవండి:

సింధు రాకెట్ వేలానికి ప్రధాని మోదీ రెడీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.