జగన్ రెడ్డి పాలన కంటే బ్రిటీష్ పాలనలోనే పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. మరో స్వాతంత్య్ర పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు జాతీయ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో నక్కా ఆనంద్ బాబు, అశోక్ బాబు, మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జగన్ రెడ్డి రెండున్నరేళ్లుగా అంబేడ్కర్ రాజ్యాంగం పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. స్వతంత్ర భారతవణిలో వాక్ స్వాతంత్య్రం లేని దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ ఎంపీ లాల్‌జాన్ భాషా వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి అచ్చెన్నాయుడు, నక్కా ఆనంద్ బాబు, ఎమ్మెల్సీ అశోక్ బాబు పూలమాల వేసి నివాళులర్పించారు.
ఇదీ చదవండి: 75వ స్వాతంత్య్ర దినోత్సవం..రెపరెపలాడిన మువ్వన్నెల జెండా