ETV Bharat / city

PENSIONS: తెలంగాణ.. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులకు అందిన కొత్త పింఛన్లు - pension for telangana employees

తెలంగాణ విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పెరిగిన పింఛన్లు అందాయి. జూన్ నెలకు సంబంధించి వేతన సవరణ ప్రకారం పెరిగిన పింఛను మొత్తాన్ని పింఛనుదారులు అందుకున్నారు. ఉద్యోగులకు మాత్రం పాత వేతనాలే అందాయి.

PENSIONS in Telangana
PENSIONS in Telangana
author img

By

Published : Jul 2, 2021, 9:07 AM IST

తెలంగాణ విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులకు పెరిగిన పింఛన్లు అందాయి. జూన్ నెలకు సంబంధించి వేతన సవరణ ప్రకారం పెరిగిన పింఛను మొత్తాన్ని పెన్షనర్లు అందుకున్నారు. ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన బకాయిలను విడిగా ఇస్తారు. అటు ఉద్యోగులకు మాత్రం పాత వేతనాలే అందాయి. వేతన సవరణ అమలు ప్రక్రియ, కసరత్తు ఇంకా పూర్తి కాలేదు. ఉద్యోగుల నుంచి ఐచ్ఛికాలు తీసుకోవడం, ఆమోదం తదితరాలకు సంబంధించిన కసరత్తు బిల్లులు రూపొందించే వరకు పూర్తి కాలేదు.

దీంతో జూన్ నెల జీతానికి వారికి పీఆర్సీ అమలు కాలేదు. అనుబంధ బిల్లు రూపొందించి వీలైనంత త్వరగా ఈ నెలలోనే మిగిలిన మొత్తాన్ని కూడా అందిస్తారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. జులై నెల వేతనం మాత్రం అందరికీ వేతనసవరణకు అనుగుణంగానే అందుతుందని చెప్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విధంగానే రెండు నెలల బకాయిలు ఇవ్వనుంది.

ఇదీ చదవండి:

JAGAN LETTER: ప్రధాని మోదీ, కేంద్ర జల్‌శక్తి మంత్రికి సీఎం జగన్‌ లేఖలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.