ETV Bharat / city

ఏపీలో పెరిగిన జీఎస్‌టీ వసూళ్లు - GST news

నవంబర్‌ నెలలో రాష్ట్ర జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. 2019 నవంబర్‌తో పోలిస్తే ఈ సారి రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు 12శాతం పెరిగాయి. గతేడాది నవంబర్‌లో రాష్ట్రానికి 2వేల 230కోట్ల రూపాయల ఆదాయం రాగా...ఈసారి 2 వేల 507 కోట్లకు చేరింది.

Increased GST collection in AP
ఏపీలో పెరిగిన జీఎస్‌టీ వసూళ్లు
author img

By

Published : Dec 2, 2020, 7:45 AM IST

నవంబర్‌ నెలలో ఆంధ్రప్రదేశ్‌ జీఎస్‌టీ వసూళ్లు పెరగ్గా, తెలంగాణకు తగ్గాయి. కేంద్ర ఆర్థికశాఖ మంగళవారం విడుదల చేసిన లెక్కల ప్రకారం 2019 నవంబర్‌తో పోలిస్తే ఈసారి ఏపీ వసూళ్లు 12% పెరిగాయి. గత ఏడాది ఇదే నెలలో రాష్ట్రానికి రూ.2,230 కోట్ల ఆదాయం రాగా, ఈసారి అది రూ.2,507 కోట్లకు చేరింది. ఇదే సమయంలో తెలంగాణ వసూళ్లు రూ.3,349 కోట్ల నుంచి రూ.3,175 కోట్లకు (-5%) తగ్గాయి. కేంద్ర ప్రభుత్వానికి వచ్చే జీఎస్‌టీ వసూళ్లు కూడా గత నవంబర్‌ కంటే ఈసారి 1.42% వృద్ధి చెందాయి.

గత నవంబరులో 1.03 లక్షల కోట్లు రాగా.. ఇప్పుడు 1.05 లక్షల కోట్లు వచ్చాయి. కేంద్ర ఖజానాకు గత ఏడాది ఏప్రిల్‌-నవంబర్‌ మధ్యకాలంలో రూ.8,05,164 కోట్లు రాగా, ఈసారి ఇప్పటివరకు వసూలైన మొత్తం రూ.6,64,709 కోట్లకు చేరింది. గత ఏడాదికంటే ఇది 17.44%మేర తక్కువ.

ఇదీ చదవండి:

కీలక వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచనున్న ఆర్బీఐ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.