కేంద్రం ప్రవేశపెట్టిన జాతీయ మెడికల్ కమిషన్(ఎన్ఎమ్సీ) బిల్లులో సవరణలు తీసుకురావాలని కోరుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎమ్ఏ) ప్రతినిధులు గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకుంటే ఈనెల 8న దేశ వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో వైద్యసేవలు నిలిపివేస్తామని హెచ్చరించారు. కేంద్రం ప్రవేశపెడుతున్న ఎన్ఎమ్సీ బిల్లులో 10 అంశాలు వైద్యరంగానికి విఘాతం కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
గవర్నర్‌తో అధికారుల సమావేశం
రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌ను రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలోని రాజ్‌భవన్‌కు వచ్చిన రమేశ్ కుమార్... స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తును గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. రైతు నేస్తం ఫౌండేషన్ వ్యవస్థాపకులు వెంకటేశ్వరరావు, రాజ్యసభ మాజీ సభ్యుడు యలమంచిలి శివాజీ గవర్నర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ కార్యదర్శి నీరబ్‌కుమార్... అటవీ సంరక్షణ- మొక్కల పెంపకానికి తీసుకుంటున్న చర్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయభాస్కర్ ఇతర సభ్యులు, అధికారులతో కలిసి గవర్నర్‌తో సమావేశమయ్యారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యకలాపాలపై గవర్నర్‌కు తెలిపారు.
ఇదీ చదవండి : 'విభజనతో నష్టపోయాం... ప్రత్యేక హోదా ఇవ్వండి'