ETV Bharat / city

ఐఎంఏ బంద్ పిలుపుతో రాష్ట్రంలో స్తంభించిన వైద్య సేవలు

author img

By

Published : Dec 11, 2020, 5:56 PM IST

భారతీయ వైద్య మండలి బంద్ పిలుపుతో.. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యసేవలు స్తంభించాయి. కరోనా, అత్యవసర సేవలు మినహా ఇతర చికిత్సలను నిలిపివేశారు. యాభైకి పైగా ఆధునిక శస్త్రచికిత్సలను ఆయుర్వేద వైద్యులు నిర్వహించడానికి కేంద్రం అనుమతివ్వడాన్ని ఖండిస్తూ.. వైద్యులు నిరసన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ima called for protests
నిరసన తెలుపుతున్న వైద్యులు

ఆయుర్వేద వైద్యులు వివిధ రకాల శస్త్ర చికిత్సలు చేసేందుకు వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై.. భారతీయ వైద్య మండలి ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ వ్యాప్తంగా ఐఎంఏ అనుబంధ ఆస్పత్రులను.. ఈరోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూసివేసి నిరసన తెలపాలని పిలుపునిచ్చింది. ఈ అనాలోచిత నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కు తగ్గని పక్షంలో.. నిరవధిక సమ్మెకు వెనకాడబోమని హెచ్చరించింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బంద్​ పిలుపుతో.. రాష్ట్రంలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్య సేవలు స్తంభించాయి. అత్యవసర సేవలు మినహా ఇతర చికిత్సలను నిలిపివేసి వైద్యులు నిరసన తెలిపారు.

నిరసన తెలుపుతున్న వైద్యులు

కృష్ణా జిల్లాలో...

ఆయుర్వేద వైద్య విధానంలో కేంద్రం చేపడుతున్న మార్పులకు వ్యతిరేకంగా.. విజయవాడలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాలు వద్ద ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు నిరసన తెలిపారు. ఇంగ్లీషు, ఆయుర్వేదం, హోమియో వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉన్నా.. మూడింటికీ సిద్ధాంతాలు, విధానాలు‌ వేరని స్పష్టం చేశారు. కేంద్రం అనాలోచితంగా తీసుకొచ్చిన ఈ బిల్లును వ్యతిరేకిస్తూ.. దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళనలు నిర్వహిస్తున్నామన్నారు. 'మిక్సియోపతి' నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

protesting doctors
నిరసన తెలుపుతున్న వైద్యులు

నెల్లూరు జిల్లాలో...

ఓ వైద్య విధానాన్ని మరోదానితో కలుపుతూ ఐసీఎంఆర్ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్​ను నిరసిస్తూ.. దేశవ్యాప్తంగా వైద్యులు ధర్నా చేపట్టారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు అందుకుని.. నెల్లూరు జిల్లాలోని అత్యవసర సేవలు మినహా ఆస్పత్రులు, నర్సింగ్ హోంలు మూతపడ్డాయి. ఆయుర్వేద వైద్యులతో ఆధునిక చికిత్సలు చేయించడం దారుణమని.. ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ అశోక్ ఆందోళన వ్యక్తం చేశారు. హోమియో, ఆయుర్వేదాలకు తాము వ్యతిరేకం కాదని.. ఇంగ్లీష్ వైద్యానికి వారిని అనుమతించడం ప్రమాదకరమన్నారు. ప్రజారోగ్య పరిరక్షణ కోసం ఒక్కరోజు బంద్ చేస్తున్నట్లు తెలిపారు.

కర్నూలు జిల్లాలో...

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఆయుర్వేద వైద్యులు శస్త్ర చికిత్సలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ఈ తరహా చర్యలు ఆపాలని నినాదాలు చేశారు.

protesting doctors
నిరసన తెలుపుతున్న వైద్యులు

గుంటూరు జిల్లాలో...

భారతీయ వైద్య మండలి పిలుపు మేరకు గుంటూరులోని ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోయాయి. వైద్యరంగ పరిరక్షణ, ప్రజల శ్రేయస్సు, వైద్య విద్యార్థుల భవిష్యత్తు కోసం నిరసన కార్యక్రమం చేపట్టినట్లు.. ఐఎంఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ నందకిశోర్ తెలిపారు. ఆయుర్వేద వైద్యులను శస్త్రచికిత్సలు చేసేందుకు అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని.. కేంద్రప్రభుత్వం ఇప్పటికైనా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేయడానికి.. నిరవధిక బంద్​కూ వెనకాడబోమని హెచ్చరించారు.

protesting doctors
నిరసన తెలుపుతున్న వైద్యులు

కడప జిల్లాలో...

ఆయుర్వేద వైద్యులకు అనేక రకాల శస్త్రచికిత్సలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని.. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు జనార్థన్ పురాణిక ఖండించారు. కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్​ను ఉపసంహరించుకోవాలని.. కడపలోని ఐఎంఏ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి శిక్షణ పొందిన వైద్యులకు బదులు.. ఆయుర్వేద వైద్యులు శస్త్రచికిత్స చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. శస్త్రచికిత్సలకు వారిని అనుమతించడం వల్ల.. ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోకుంటే.. దశలవారీగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

protesting doctors
నిరసన తెలుపుతున్న వైద్యులు

ఆయుర్వేద వైద్యులు ఎలా శస్త్రచికిత్స నిర్వహిస్తారు? కేంద్ర ప్రభుత్వం వారిని ఎందుకు అనుమతించిందో చెప్పాలని.. రాజంపేట ఐఎంఏ కార్యాలయంలో పలువురు వైద్యులు ప్రశ్నించారు. ఆయుర్వేద వైద్యులతో అధునాత ఆపరేషన్లు చేయించడం, మందులను ఉపయోగించడం ఎంత ప్రమాదకరమో ప్రభుత్వం గుర్తించాలని.. స్థానిక సంఘ అధ్యక్షుడు విజయభాస్కర్, సీనియర్ వైద్యులు చంద్రశేఖర్ రెడ్డి హితవు పలికారు. ఇలాంటి కిచిడీ వైద్యంతో చికిత్సలు అందించడం.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి.. తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు.

ima called for protests
నిరసన తెలుపుతున్న వైద్యులు

అనంతపురం జిల్లాలో...

అవగాహన లేని వ్యక్తులు శస్త్రచికిత్సలు చేస్తే ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని.. భారతీయ వైద్య మండలి సభ్యులు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఆయుర్వేద వైద్యులు శస్త్ర చికిత్సలు చేసేందుకు సీసీఐఎం అనుమతి ఇవ్వడంపై.. అనంతపురంలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రైవేటు ఆస్పత్రుల సేవలు నిలిపివేసి వైద్యులు నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని కోరారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం విరమించి.. ఈ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

టోల్​ప్లాజా వద్ద 686 కిలోల వెండి పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.