ప్రతిష్ఠాత్మక ఐసీఏబీఆర్ (ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆన్ అప్లైడ్ బయో ఎకానమీ రీసెర్చి) కార్యనిర్వాహక బోర్డు సభ్యుడిగా ఆర్థిక వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టరు నూతలపాటి చంద్రశేఖరరావు ఎంపికయ్యారు. జూన్ 29 నుంచి జులై 2 వరకు జరిగిన ఇటలీలోని రావెల్లో కేంద్రంగా జరిగిన సదస్సులో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. 1998లో ఏర్పాటైన ఈ సంఘం.. బయో ఎకానమీ, వ్యవసాయ బయో టెక్నాలజీ, గ్రామీణాభివృద్ధి, బయో ఆధారిత ఎకానమీ రీసెర్చి తదితర అంశాలపై దృష్టి పెడుతుంది. దీనికి సభ్యునిగా ఎంపికైన చంద్రశేఖరరావు స్వస్థలం ప్రకాశం జిల్లా మార్కాపురం. బాపట్ల వ్యవసాయ కళాశాలలో ఆయన డిగ్రీ, పీజీ పూర్తి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పదేళ్ల పాటు వ్యవసాయశాఖలో సేవలందించారు. సెస్ నుంచి పీహెచ్‌డీ చేశారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీలు, పదోన్నతులు