ETV Bharat / city

IMA Passing Out Parade 2021: ఆ కుటుంబంలో మూడు తరాల సైనికులు.. ఇప్పుడు ఇంకొకరు.. - ima passing out parade

IMA Passing Out Parade 2021: వారి నరనరాల్లో దేశభక్తి నిండిపోయింది. ఆ కుటుంబమంతా దేశసేవకే అంకితమయ్యారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. ఆ కుటుంబం నుంచి మరో దేశభక్తుడు భరతమాతకు సేవ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఐఎంఏలో శిక్షణ తీసుకుని పదునైన ఆయుధంగా మారాడు. అకుంఠిత దీక్ష, కఠోర శిక్షణ ముగించుకొని లెఫ్టినెంట్​ హోదాలో సైనికాధికారి అయ్యాడు.

Vaishakh Chandran
Vaishakh Chandran
author img

By

Published : Dec 11, 2021, 8:32 PM IST

ఆ కుటుంబంలో మూడు తరాల సైనికులు.. ఇప్పుడు ఇంకొకరు సైన్యంలోకి..

IMA Passing Out Parade 2021:తెలంగాణలోని హైదరాబాద్​ ఆర్టీ సెంటర్​కు చెందిన.. వైశాఖ్​ చంద్రన్​ డెహ్రాదూన్​ ఇండియన్​ మిలిటరీ అకాడమీలో శిక్షణ ముగించుకున్నారు. లెఫ్టినెంట్​ హోదాలో సైనికాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. వైశాఖ్​ చంద్రన్​ను లెఫ్టినెంట్​గా చూసి ఆయన కుటుంబం మొత్తం సంతోషంలో మునిగిపోయింది. ​తమ కుటుంబ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. సుశిక్షితునిగా దేశసేవలో భాగస్వామి కావటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సైన్యంలో చేరటం.. కుటుంబ సంప్రదాయమేంటని ఆలోచిస్తున్నారా.. అయితే వైశాఖ్​ చంద్రన్ కుటుంబ​ నేపథ్యాన్ని కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..

ఆ కుటుంబమంతా సైనికులే..
వైశాఖ్​ చంద్రన్​ కుటుంబం ఓ సైనికుల కర్మాగారం. ఆయన తాతలిద్దరూ సైనికులుగా దేశానికి సేవ చేశారు. తండ్రి సునీల్​ చంద్రన్​.. ప్రస్తుతం ఆర్టిలరీ డివిజన్​లో కర్నల్​గా విధులు నిర్వర్తిస్తున్నారు. వీళ్లే కాకుండా.. వైశాఖ్​ సోదరి భర్త నేవీలో అధికారిగా సేవలందిస్తున్నారు. తాను పుట్టటమే ఓ సైనిక కుటుంబంలో పుట్టటం.. చిన్నప్పటి నుంచి వాళ్ల వీరత్వాలు చూస్తూ పెరగటం.. దేశానికి వాళ్లు చేస్తున్న సేవలను నరనరాన జీర్ణించుకున్న వైశాఖ్​.. తాను కూడా సైనికుడిగా మారాలని చిన్నప్పటి నుంచి ఎన్నో కలలు కన్నారు. వాటిని సాకారం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమించారు.

తాతల నుంచి దేశసేవలోనే..
2020 సెప్టెంబర్​లో వైశాఖ్​ చంద్రన్​ ఐఎంఏలో చేరారు. డెహ్రాదూన్​లోని మిలిటరీ అకాడమీలో.. కఠోర శిక్షణ తీసుకుని నేడు సుశిక్షితునిగా బయటికి వచ్చాడు. లెఫ్టినెంట్​ హోదాలో ఆర్మీ అధికారిగా.. తన తాతలు, తండ్రి, బాటలోనే దేశానికి తనవంతు సేవ చేసేందుకు బాధ్యతలు స్వీకరించారు. వైశాక్​ చంద్రన్​ ఆర్మీలోకి రావటంతో.. వాళ్ల కుటుంబం మొత్తం సైనికులతో నిండిపోయినట్టైంది. సైన్యంలో వైశాఖ్​ చేరటం.. శిక్షణ ముగించుకుని బాధ్యతలు స్వీకరించటాన్ని చూసి అందరూ.. ఇది వాళ్ల కుటుంబ సంప్రదాయంగా అభివర్ణిస్తున్నారు.

వైశాఖ్​ తల్లి భావోద్వేగం..
తన కుమారుడు వైశాఖ్​... లెఫ్టినెంట్​గా బాధ్యలు స్వీకరించటాన్ని చూసి ఆయన తల్లి అనిత భావోద్వేగానికి గురయ్యారు. ఇండియన్ మిలిటరీ అకాడమీ లాంటి చారిత్రాత్మక సైనిక క్షేత్రం నుంచి తన కుమారుడు అధికారిగా దేశానికి సేవ చేయబోతున్నాడంటే ఇంతకు మించిన ఆనందం మరొకటి ఉండదని తెలిపారు.

"ఇవాళ్టి పాసింగ్ ఔట్ పరేడ్​లో నా కుమారుడు ఉండటం నాకు చాలా గర్వంగా ఉంది. మేం హైదరాబాద్ ఆర్టీ సెంటర్​ నుంచి వచ్చాం. వైశాఖ్​ను చూడక ఏడాది దాటింది. గత ఏడాది సెప్టెంబర్​ నుంచి వైశాఖ్​ని కలవనే లేదు. నిన్ననే కలిశాం. మాది ముందు నుంచి సైనిక కుటుంబం. మా నాన్న ఆర్మీలో పనిచేశారు, భర్త ప్రస్తుతం కర్నల్​గా ఉన్నారు. నా కూతురు భర్త కూడా నేవీలో పనిచేస్తున్నాడు. వైశాఖ్‌కి ​​కూడా చిన్నప్పటి నుంచి సైన్యంలో చేరాలనే కోరిక ఉండేది. తన అంకితభావంతో అది ఈరోజు నెరవేరింది. నా కుటుంబానికి ఇంత కన్నా గర్వకారణం ఇంకేముంటుంది." - అనిత సునీల్ చంద్రన్, వైశాఖ్ చంద్రన్ తల్లి

అందరి మనసులూ గెలుచుకున్నాడు..
తన సోదరుడు కుటుంబ సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లి అందరి హృదయాలను గెలుచుకున్నాడని వైశాఖ్​ సోదరి.. శ్రుతి తెలిపారు. పూర్తి అంకితభావంతో, నిజాయితీతో కష్టపడి.. ఈరోజు అందరి హృదయాలను గెలుచుకున్నారని హర్షం వ్యక్తం చేశారు.

"మా అన్నయ్య సైన్యంలో చేరడం చాలా సంతోషంగా ఉంది. ఒక కూతురుగా, భార్యగా, సోదరిగా చాలా గర్వంగా ఉంది. చిన్నప్పటి నుంచి వైశాఖ్​కు సైన్యంలో చేరాలన్నదే కోరిక. ఈ సమయం కోసం ఇన్నాళ్లు చాలా కష్టపడ్డాడు. చివరికి అనుకున్నది సాధించి.. మా అందరి మనసులు గెలుచుకున్నాడు." -శ్రుతి చంద్రన్, వైశాఖ్ చంద్రన్ సోదరి

ఇదీ చూడండి:

సాయితేజ భౌతికకాయానికి వాయుసేన అధికారుల నివాళి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.