కరోనాతో మరణ మృదంగం మోగిస్తోన్న ఇటలీలో తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్కు చెందిన విద్యార్థులు చిక్కుకున్నారు. భారత్కు తిరిగి వచ్చేందుకు తాము చివరివరకు ప్రయత్నించినా... ఫలితం లేకుండాపోయిందని వాపోయారు. ఇటలీలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించినా తమకు సహకారం లభించట్లేదని ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం భారత్లో దేశీయ, విదేశీ విమానాల రాకపోకలు నిలిపేశారు.
ఇటలీలో కరోనా విలయ తాండవం చేస్తుండటం వల్ల విద్యార్థులు మరింత భయాందోళనలకు గురవుతున్నారు. తమతోపాటు 130కు పైగా భారతీయ విద్యార్థులు ఇక్కడ చిక్కుకున్నట్లు తెలిపారు. తమను స్వదేశానికి తీసుకువెళ్లేందుకు కేంద్రం చొరవ చూపాలని సెల్ఫీ వీడియో ద్వారా అభ్యర్థిస్తున్నారు.
ఇవీ చూడండి : కరోనాపై భారత్ పోరాటానికి జీ- 20 దేశాల ప్రశంసలు