ETV Bharat / city

POLLING: హుజూరాబాద్ లో జోరుగా పోలింగ్.. సాయంత్రం 5 వరకు 76.26 శాతం ఓటింగ్ - తెలంగాణ వార్తలు

ఉత్కంఠ రేపుతున్న తెలంగాణలోని హుజూరాబాద్‌ ఉపఎన్నిక పోలింగ్(Huzurabad by election 2021) కొనసాగుతోంది. సాయంత్రం 7 గంటల పోలింగ్ ముసిగింది. ఈ ఉపఎన్నికల ఫలితాలు నవంబర్‌ 2న వెల్లడి కానున్నాయి.

ఉత్కంఠ రేపుతున్న తెలంగాణలోని హుజూరాబాద్‌ ఉపఎన్నిక పోలింగ్

author img

By

Published : Oct 30, 2021, 8:54 AM IST

Updated : Oct 30, 2021, 7:32 PM IST

హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్(Huzurabad by election 2021) ప్రశాంతంగా కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు 76.26 శాతం పోలింగ్ నమోదైంది. రాత్రి 7 గంటల వరకు పోలింగ్‌ కొనసాగింది. హుజూరాబాద్ ఉపఎన్నికల పోలింగ్ సరళిని సీఈవో శశాంక్ గోయల్ పరిశీలించారు. బుద్ధభవన్ నుంచి వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పర్యవేక్షించారు.కరోనా నిబంధనల నడుమ పోలింగ్ ముసిగింది. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అన్ని వసతులు కల్పించారు. పోలింగ్ కేంద్రాల ఆవరణలో హెల్త్ క్యాంప్​ను ఏర్పాటు చేశారు.

భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ కమలాపూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కమలాపూర్‌లోని పోలింగ్ కేంద్రం 262లో ఓటేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌..... సాయంత్రం 7 గంటల వరకు జరిగింది. పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు. వీణవంకలో ఓటర్లు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే పోలింగ్‌ సెంటర్‌ వద్దకు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చారు. కరోనా జాగ్రత్తలతో పోలింగ్‌(Huzurabad by election 2021) జరిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్కంఠ రేకెత్తిస్తున్న హుజూరాబాద్ ఓట్ల లెక్కింపు నవంబర్ 2న జరగనుంది.

హుజూరాబాద్ ఉపఎన్నిక(Huzurabad by elections 2021) కొనసాగుతోంది. కాగా పలు చోట్ల ఆందోళనలు జరిగాయి. నియోజకవర్గంలోని వీణవంక మండలంలో పలుచోట్ల అధికార తెరాస, భాజపా శ్రేణుల మధ్య వాగ్వాదాలు జరిగాయి. గులాబీ పార్టీ నేతలు డబ్బులు పంచుతున్నారంటూ కమలం పార్టీ నాయకులు ఆందోళనలకు దిగారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు... పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు.

చల్లూరులో వాగ్వాదం

వీణవంక మండలం చల్లూరులో భాజపా శ్రేణులు ఆందోళన చేపట్టాయి. మార్కెట్ ఛైర్మన్ బాలకిషన్‌రావు ఇంట్లో డబ్బులు పంచుతున్నారని భాజపా నేతలు ధర్నాకు దిగారు. ఈ క్రమంలో చల్లూరులో భాజపా, తెరాస శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది.

కౌన్సిలర్ ఇంటి ఎదుట ఆందోళన

జమ్మికుంట 28వ వార్డులో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెరాస కౌన్సిలర్ దీప్తి ఇంట్లో డబ్బులు పంచుతున్నారని భాజపా శ్రేణులు నిరసనకు దిగారు. దీప్తి ఇంటి ఎదుట భాజపా శ్రేణులు ఆందోళనకు దిగారు. డబ్బులు స్వాధీనం చేసుకోవాలంటూ రోడ్డుపై బైఠాయించారు. భాజపా శ్రేణుల ఆందోళనతో స్వల్ప ఉద్రిక్తత తలెత్తింది.

తెరాస వర్సెస్ భాజపా

వీణవంక మండలం కోర్కల్‌లో... తెరాస, భాజపా శ్రేణుల మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్‌ కేంద్రం వద్ద సర్పంచ్‌ ప్రచారం చేస్తున్నారని... భాజపా అభ్యంతరం తెలిపింది. సర్పంచ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో... పోలీసులు ప్రవేశించి ఇరు వర్గాలను చెదరగొట్టారు.

శ్రీరాములపల్లిలో ఘెరావ్

హుజూరాబాద్ నియోజకవర్గం.. శ్రీరాములపల్లిలో తెరాస నేతను భాజపా శ్రేణులు అడ్డుకున్నారు. గజ్వేల్ మార్కెట్ ఛైర్మన్ మాదాసు శ్రీనివాస్‌ను... భాజపా కార్యకర్తలు ఘెరావ్‌ చేశారు. స్థానికేతరులు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. భాజపా అభ్యంతరంతో.. తెరాస నేత మాదాసు శ్రీనివాస్‌ వెళ్లిపోయారు.

అధికార పార్టీ మద్యం ఏరులై పారిస్తోంది. మాకు డబ్బులు ఇవ్వలేదని ఓటర్లే ఆందోళన చేసే పరిస్థితి ఏర్పడింది. పోలింగ్ రోజు కూడా డబ్బులు పంచుతున్నారు. ఈసీ కూడా డబ్బు పంపిణీని అడ్డుకోలేకపోతోంది. మంచి చెడు ఆలోచించుకునే సత్తా ప్రజలకు ఉంది.

-భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్

ఇదీ చదవండి:

బద్వేలు ఉపఎన్నిక పోలింగ్‌ ప్రారంభం

Last Updated : Oct 30, 2021, 7:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.