ETV Bharat / city

‘దివ్య’మైన ప్రేమ ప్రయాణం! - బల్లారి తాజా వార్తలు

కోటి మాటలెందుకు.. గుప్పెడు ప్రేమ చాలదా ఈ జీవితానికి అనిపిస్తుంది ఆ దంపతులను చూస్తే! కాళ్లు లేని ఆమెను మోస్తూ అతను సాగిస్తున్న ప్రేమప్రయాణం అనురాగానికి నిదర్శనం.

pair
pair
author img

By

Published : Nov 10, 2020, 6:16 AM IST

Updated : Nov 10, 2020, 7:19 AM IST

మహేంద్రది బళ్లారి. అన్నపూర్ణది కర్ణాటకలోని కొప్పల్‌ తాలూకా ఇక్‌నాల్‌ గ్రామం. చిన్నతనంలోనే ఆమెకు పోలియో సోకి, రెండు కాళ్లు నడవలేని పరిస్థితి. వీరిద్దరూ ఏడాది కిందట ఓ గుడిలో ఒకరికొకరు పరిచయం అయ్యారు. తర్వాత ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం బళ్లారిలోని ఇందిరానగర్‌లో ఉంటున్నారు. మహేంద్ర కూలీ పనికి వెళ్లి భార్యను పోషించుకుంటున్నారు. సంపాదనలో కొంత మిగుల్చుకొని వివిధ ప్రాంతాలు పర్యటిస్తారు. మహేందర్‌ ఎటూ వెళ్లినా భార్యని ఇలా చంకన వేసుకుని తీసుకువెళ్తారు. ఆదివారం బళ్లారి నుంచి కర్నూలు జిల్లా ఆదోనికి వచ్చిన వారిని ‘న్యూస్‌టుడే’ పలకరించింది. కాళ్లు లేవని ఏనాడూ బాధ లేదని, తనకు ఏదైనా ఉపాధి చూపిస్తే భర్తకు చేదోడుగా ఉండగలనని అన్నపూర్ణ తెలిపారు.

ఇదీ చదవండి: స్టేటస్ కో ఉండగానే రైతు భరోసా కేంద్రం నిర్మిస్తారా..?: హైకోర్టు

Last Updated : Nov 10, 2020, 7:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.