తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం నీల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను భర్త హతమార్చిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి కందకుర్తి వద్ద గోదావరి నదిలో పడేసి అదృశ్యంగా చిత్రీకరించడానికి యత్నించాడు ఆ భర్త. మహిళ కుమారుడి ఫిర్యాదుతో గతేడాది నవంబర్ 28న అదృశ్యం కేసుగా నమోదు చేసిన అనంతరం... రెంజల్ పోలీసుల దర్యాప్తులో తీగ లాగితే డొంక కదిలింది.
రెంజల్ మండలం నీల గ్రామానికి చెందిన ఒడ్డె సాయవ్వను భర్త, కుటుంబ సభ్యులు కలిసి హత్య చేశారని పోలీసులు తెలిపారు. సెల్ ఫోన్ ఆధారంగా నిందితులను పట్టుకున్నట్లు వెల్లడించారు. తొమ్మిది మంది కుటుంబ సభ్యులతో పాటు ఆమె భర్తనూ అదుపులోకి తీసుకున్నామని బోధన్ ఏసీపీ రామారావు తెలిపారు. ఒక ఎకరం పద్దెనిమిది గుంటల భూమిలో ఆమె వాటాను పొందడానికే అందరూ కలిసి హత్య చేసినట్లు ఆయన వివరించారు. గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహం కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: రూ.200 కోసం ఘర్షణ.. వ్యక్తి మృతి