ETV Bharat / city

కరోనా విజృంభణ..కొత్తగా 947 పాజిటివ్ కేసులు - ap corona cases

రాష్ట్రంలో కరోనా కోరలు చాస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 947 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని, కొవిడ్ టీకా తీసుకోవాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు.

corona ap
కరోనా విజృంభణ.. ఒక్కరోజులో 947 పాజిటివ్ కేసులు
author img

By

Published : Mar 27, 2021, 5:19 PM IST

రాష్ట్రంలో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 947 మంది కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 8,97,810కి పెరిగింది. వైరస్​ నుంచి 377 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో ఒక్క మరణం కూడా నమోదు కాలేదని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా 4,715 క్రియాశీల కేసులున్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.

జిల్లాల వారీగా నమోదైన కేసులు

చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 180 మందికి, విశాఖలో 156, గుంటూరులో 145, కృష్ణాలో 113 మందికి కరోనా సోకినట్టు వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. అనంతపురంలో 35, తూర్పుగోదావరిలో 58, కడపలో 40, కర్నూలులో 61 మందికి, నెల్లూరులో 43, ప్రకాశం 23, శ్రీకాకుళంలో 56, విజయనగరంలో 19, పశ్చిమ గోదావరిలో 18 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

corona ap
కరోనా విజృంభణ.. ఒక్కరోజులో 947 పాజిటివ్ కేసులు

ఇదీ చదవండి: ప్రజలందరూ ఇళ్లల్లో ఉండి పండుగ జరుపుకోవాలి: గవర్నర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.