ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టుపై హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలైంది. రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాదులు పిటిషన్ వేశారు. నిబంధనల ప్రకారం ఎంపీని అరెస్టు చేయలేదని పిటిషన్‌లో వెల్లడించారు. రఘురామకు అనారోగ్య సమస్యలు ఉన్నాయన్న న్యాయవాదులు... విచారణకు కోర్టు అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు.
విచారిస్తున్న అధికారులు...
సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి రఘురామను తీసుకెళ్లారు. సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి ఆ విభాగ డీఐజీ సునీల్‌కుమార్ వచ్చారు. ఎంపీ రఘురామకృష్ణరాజును సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
ఇదీ చదవండీ... జగన్ పాలనలో ప్రశ్నించే గొంతుకకు సంకెళ్లే బహుమతా?: చంద్రబాబు