నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయడంపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. నిబంధనల ప్రకారం ఎంపీని అరెస్టు చేయలేదని ఆయన తరఫు న్యాయవాదులు పిటిషన్‌లో పేర్కొన్నారు. రఘురామకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. అయితే ఈ పిటిషన్‌పై హైకోర్టు.. ఇవాళ మధ్యాహ్నం విచారణ జరపనుంది. విచారణ పూర్తయ్యే వరకు మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచవద్దని హైకోర్టు తెలిపింది. సీఐడీ అధికారుల కస్టడీలో ఉన్న రఘురామ కృష్ణరాజుకు సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది. ఆహారం, వైద్యం, వసతికి వెసులుబాటు కల్పించాలని న్యాయస్థానం పేర్కొంది.
ఇదీ చదవండి