ETV Bharat / city

ఆర్టీసీపై.. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు సూటి ప్రశ్న! - highcourt

తెలంగాణ ఆర్టీసీలో 5,100 రూట్ల ప్రైవేటీకరణపై మంత్రి మండలి నిర్ణయాన్ని రహస్యంగా ఉంచాల్సిన అవసరమేంటని.. ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. రూట్ల ప్రైవేటీకరణ పర్మిట్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.

tsrtc
author img

By

Published : Nov 14, 2019, 7:34 PM IST

ఆర్టీసీపై.. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు సూటి ప్రశ్న!

తెలంగాణ ఆర్టీసీలో రూట్ల ప్రైవేటీకరణ పర్మిట్లపై ఆ రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. మంత్రిమండలి నిర్ణయాన్ని ఆ రాష్ట్ర ఏజీ... సీల్డ్‌కవర్‌లో న్యాయస్థానానికి సమర్పించారు. జీవో వచ్చిన తర్వాతే కేబినెట్‌ నిర్ణయాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. స్పందించిన కోర్టు.. మంత్రిమండలి నిర్ణయాన్ని రహస్యంగా ఉంచాల్సిన అవసరమేంటని ప్రశ్నించింది. ప్రభుత్వ నిర్ణయం తమకు తెలియకపోతే ఎలా వాదిస్తామని పిటిషనర్​ తరఫు న్యాయవాది కోర్టును అడిగారు. రూట్ల ప్రైవేటీకరణ పర్మిట్లపై మంత్రిమండలి ఏ ప్రతిపాదికన నిర్ణయం తీసుకుందని పిటిషనర్​ ప్రొఫెసర్ పి.ఎల్‌. విశ్వేశ్వరరావు ప్రశ్నించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

ఇవీ చూడండి:

'శబరిమల' కేసు విస్తృత ధర్మాసనానికి బదిలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.