తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఐదేళ్లు పూర్తైన సందర్భంగా రాజధాని రైతులు ఉద్దండరాయునిపాలెం వద్ద సభ నిర్వహించారు. వీరికి వ్యతిరేకంగా, మూడు రాజధానులు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి నేతలు ఉద్దండరాయునిపాలెం వచ్చారు. పోటాపోటీ నినాదాలతో ఆ ప్రాంతం ఒక్కసారి వేడెక్కింది.
ఉద్యమం చేస్తున్న రైతులను పోలీసులు అక్కడినుంచి బలవంతంగా పంపించేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ రైతులు రోడ్డుపై బైఠాయించారు. ఘటనా స్థలిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు భారీగా మోహరించారు.
ఇదీచదవండి