గుంటూరు జిల్లా తాడేపల్లిలోని అమరారెడ్డినగర్‌లో రాత్రికిరాత్రే అధికారులు ఇళ్లు తొలగించటం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల సాయంతో.. నగరపాలక సంస్థ అధికారులు కూల్చివేత ప్రారంభించారు. ఇళ్లలో ఉన్న సామాన్లు బయటకు తీసేందుకైనా సమయం ఇవ్వలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం జరిగేలా చూడాలంటూ ఇటీవలే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలిసిన శివశ్రీ ఇంటిని సైతం తొలగిస్తుండగా.. ఆమె అమ్మకు గుండెపోటు వచ్చి కింద పడిపోయారు.
ఆమెను అప్పటికప్పుడు అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. కూల్చివేత ఆపాలంటూ.. జేసీబీకి అడ్డంగా పడుకున్న వాళ్లను.. అధికారులు అక్కడినుంచి లాగి బయటకు పంపించారు. ఆగ్రహానికి గురైన బాధితులు.. ఇంట్లోకి వెళ్లి ఉరి వేసుకునేందుకు యత్నించారు. అర్ధరాత్రి ఇళ్ల కూల్చివేత ఆపాలని.. తెలుగుదేశం నేతలు, వామపక్షాల నేతలు విజ్ఞప్తి చేసినా.. అధికారులు ఎవరినీ పట్టించుకోలేదు.
ఇదీ చదవండి:
Rains in Andhra Pradesh: రాష్ట్ర వ్యాప్తంగా.. వర్షాలు విస్తారంగా...!