రాష్ట్రంలో నేడు, రేపు ఎండలు తీవ్ర రూపం దాల్చనున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల వరకు నమోదు కానున్నాయి. వడగాల్పుల తీవ్రత పెరగనుంది. గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో తీవ్ర ఉక్కపోత పరిస్థితులు ఎదురుకానున్నాయి. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 39 మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీస్తాయి. వృద్ధులు, పిల్లలు బయటకు రాకుండా ఉండాలని అమరావతి వాతావరణ కేంద్రం, విపత్తు నిర్వహణ శాఖ సూచించాయి. నిన్న పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లోని 15 మండలాల్లో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భీతిల్లే పరిస్థితి నెలకొంది.
- నిన్న పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో45.7, పెంటపాడులో 46.1, తణుకులో 46.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
- నేడు గుంటూరు జిల్లా పొన్నూరులో 46.9, క్రోసూరు,కొల్లూరు, తెనాలి, వట్టిచెరుకురు, చెరుకుపల్లి తదితర ప్రాంతాల్లో 46.6 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా.
ఇదీ చదవండి: రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభం