ETV Bharat / city

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై నేడు హైకోర్టులో తీర్పు

author img

By

Published : May 20, 2021, 10:39 PM IST

Updated : May 21, 2021, 2:42 AM IST

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై నేడు హైకోర్టులో తీర్పు వెలువడనుంది. ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో గతంలో పలు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే.

high court verdict on mptc and zptc elections

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విషయంలో నేడు హైకోర్టు తుది తీర్పు వెలువరించనుంది. పోలింగ్ తేదీకి 4వారాల ముందు ఎన్నికల కోడ్‌ విధించాలన్న సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా పరిషత్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిందంటూ తెదేపా నేత వర్ల రామయ్య న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దానిపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి .. ఏప్రిల్ 8 న జరగనున్న ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేస్తూ 6 వ తేదీన మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.

దీనిపై SEC అప్పీల్ దాఖలు చేయగా ఎన్నికల నిర్వహణకు అనుమతిచ్చి...లెక్కింపు ప్రక్రియ నిలుపుదల చేసింది. దీనిపై లోతుగా విచారణ జరపాల్సిందిగా సింగిల్‌ జడ్జికి హైకోర్టు అప్పగించింది. దీంతోపాటు జనసేన, భాజపా నేతలు దాఖలు చేసిన వ్యాజ్యాలపైనా సింగిల్ జడ్జి ఈనెల 4 న విచారణ జరిపి తీర్పును రిజర్వు చేశారు.

ఇదీ చదవండి: రాష్ట్ర బడ్జెట్‌ రూ.2,29,779 కోట్లు.. సంక్షేమ పథకాలకు పెద్దపీట

Last Updated : May 21, 2021, 2:42 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.