ETV Bharat / city

'పిటిషనర్లపై తొందరపాటు చర్యలొద్దు'

author img

By

Published : Oct 29, 2020, 4:32 AM IST

అమరావతిలో భూముల కొనుగోలు వ్యవహారంపై సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసులో సోమవారం వరకు తొందరపాటు చర్యలొద్దని హైకోర్టు ఆదేశించింది. రాజధాని ఏర్పాటు సమయంలో...గత ప్రభుత్వ పెద్దల ద్వారా సమాచారం తెలుసుకుని అమరావతిలో భూములు కొనుగోలు చేశారని మంగళగిరి సీఐడీ పోలీసులు పలువురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.

High court
High court

రాజధాని అమరావతి చుట్టుపక్కల పలువురు భూములు కొనుగోలు చేశారని వెలగపూడి గ్రామానికి చెందిన సలివేంద్ర సురేశ్ అనే వ్యక్తి సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కె. శ్రీహాస, కె. రాజేశ్, నార్త్ పేస్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు తొట్టెంపూడి వెంకటేశ్వరరావు, సీహెచ్ తేజస్వీ, లలిత సూపర్ స్పెషాలిటీస్ ఆసుపత్రి ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్​పై కేసు నమోదు చేశారు. తమపై నమోదైన కేసును రద్దు చేయాలని కోరుతూ వారు హైకోర్టులో మూడు వ్యాజ్యాలు దాఖలు చేశారు. జస్టిస్ టి. రజనీ బెంచ్ ముందుకు రెండు వ్యాజ్యాలు, మరో వ్యాజ్యం జస్టిస్ కె. లలిత వద్దకు విచారణకు వచ్చాయి. జస్టిస్ రజనీ తన ముందున్న వ్యాజ్యాల్ని, జస్టిస్ లలిత వద్దకు బదిలీ చేయగా ఆమె విచారణ జరిపారు.

ఫిర్యాదు చేసే అర్హత సురేశ్​కు లేదు

లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి డైరెక్టర్ తరపు న్యాయవాది ఏకే కిశోర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ .. తాము రాజధాని సమీపంలో భూములు కొనుగోలు చేయలేదన్నారు. ఫిర్యాదులోనే ఎంత విస్తీర్ణం ఎక్కడ కొనుగోలు చేశామో పేర్కొనలేదన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసే అర్హత ఫిర్యాదుదారు సలివేంద్ర సురేశ్​కు లేదన్నారు. ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయడం తగదని కోర్టుకు తెలిపారు. మిగిలిన పిటిషనర్ల తరపు న్యాయవాది ప్రణతి వాదనలు వినిపిస్తూ... భూములు విక్రయించిన వారికి అభ్యంతరం ఉంటే ఫిర్యాదు చేసే అర్హత ఉంటుందని స్పష్టం చేశారు. భూములతో సంబంధం లేదని సురేశ్ ఏవిధంగా ఫిర్యాదు చేస్తారని ప్రశ్నించారు. అతను ఎలాంటి మోసానికి గురికాలేదని పేర్కొన్నారు. ప్రైవేటు వ్యక్తుల మధ్య చోటు చేసుకున్న కొనుగోళ్లపై మూడో వ్యక్తి ఫిర్యాదు చేయలేరని కోర్టుకు స్పష్టం చేశారు. వ్యాపార నిర్వహణలో భాగంగా నార్త్ పేస్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ భూముల క్రయవిక్రయాలు నిర్వహించిందన్నారు. ప్రాథమిక ఆధారాలు లేకుండా పోలీసులు కేసు నమోదు చేశారని కోర్టుకు తెలిపారు.

ప్రాథమిక విచారణ తర్వతే కేసు

ప్రాథమిక విచారణ జరిపిన తర్వాతే కేసు నమోదు చేశారని పోలీసుల తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. రాజధాని ఎక్కడ ఏర్పాటు కాబోతుందో ముందుగా సమాచారం సేకరించి తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేశారన్నారు. ఈ ఆరోపణ నిజమైతే .. తీవ్రమైన వైట్ కాలర్ నేరమవుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బినామీల పేరుతో భూముల కొనుగోలు చేయడం .. తదితర వ్యవహారాలు మనీలాండరింగ్ చట్టం కిందకి వస్తాయన్నారు. పిటిషనర్ల విషయంలో పోలీసులు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకునే పరిస్థితి లేదని కోర్టుకు తెలిపారు. ఈ వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి .. విచారణను సోమవారానికి వాయిదా వేశారు. అప్పటి వరకు పిటిషనర్ల అరెస్ట్ తదితర విషయాల్లో తొందరపాటు చర్యలొద్దని పోలీసులను ఆదేశించారు.

ఇదీ చదవండి : అనాలోచిత ఖర్చులతో అప్పుల ఊబిలోకి రాష్ట్రం: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.