High Court on Rushikonda: రుషికొండపై అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయంటూ దాఖలైన పిటిషన్ల విచారణలో హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. తెదేపా నేత వెలగపూడి రామకృష్ణ, మరొకరు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. న్యాయవాదులు పరిశీలనకు వెళితే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వం వైపు నుంచి ఏదో దాస్తున్నట్టు కనిపిస్తుందని వ్యాఖ్యానించింది. కేంద్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో తనిఖీ చేయమని పంపుతామని ధర్మాసనం తెలిపింది. కమిటీ వేస్తే మీరెందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది.
9.88 ఎకరాలకు అనుమతిస్తే 20 ఎకరాల్లో తవ్వకాలు చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. గూగుల్ మ్యాప్‌లను అందించారు. 9.88 ఎకరాలకే తవ్వకాలు, నిర్మాణాలు చేపట్టామని ప్రభుత్వ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. గూగుల్ మ్యాప్‌లు అబద్ధాలు చెబుతాయా అని హైకోర్టు సీజే ప్రశ్నించారు. ఆఫిడవిట్ దాఖలుకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది నిరంజన్‌రెడ్డి కోరారు. అఫిడవిట్ వేసిన తర్వాత వాస్తవాలు తేలుస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. కేసు విచారణ నవంబర్ 3కు వాయిదా వేసింది.
ఇవీ చదవండి: