2019 సెప్టెంబర్ 30కి పూర్వం పదవీ విరమణ చేసిన పలువురు ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు.. హైకోర్టులో ఊరట లభించింది. వారికి పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లు వచ్చే వరకూ సర్వీసులో కొనసాగటానికి, ప్రయోజనాలు పొందటానికి అర్హులని హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టును ఆశ్రయించిన పిటిషనర్ల వయసు.. 60 ఏళ్ల లోపు ఉంటే తక్షణమే పునర్నియమించాలని ఆదేశించింది. 2010 సెప్టెంబర్ 10న ఏపీఎస్ ఆర్టీసీ వైస్ ఛైర్మన్ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం... 58 ఏళ్లకే పలువురు ఆర్టీసీ ఉద్యోగులు పదవీవిరమణ చేశారు.
ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నోటిఫికేషన్ ఉందంటూ... పదవీ విరమణ పొందిన కొందరు ఉద్యోగులు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. 2017 లో పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని హైకోర్టు తెలిపింది. దీన్ని పరిగణలోకి తీసుకోకుండా ఆర్టీసీ వైస్ ఛైర్మన్ విడుదల చేసిన నోటిఫికేషన్ ఉద్యోగుల మధ్య వివక్ష చూపేలా ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. నోటిఫికేషన్‌ను రద్దుచేస్తూ తీర్పు ఇచ్చింది.
ఇదీ చదవండి:
Mercy Killing: కుమారుడి యాతనతో బరువెక్కిన తల్లి హృదయం.. వెక్కిరించిన విధి