ETV Bharat / city

ఏకగ్రీవాలపై 23 వరకు విచారణ జరపవద్దు : హైకోర్టు - రాష్ట్ర ఎన్నికల సంఘం

ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు నిర్ధారిస్తూ ఎన్నికల అధికారి ప్రకటన చేసిన చోట ( ఫాం -10 ఇచ్చిన చోట ) ఈ నెల 23 వరకు అధికారులు / రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలాంటి విచారణా జరపవద్దని హైకోర్టు స్పష్టం చేసింది.

ఏకగ్రీవాలపై 23 వరకు విచారణ జరపవద్దు : హైకోర్టు

author img

By

Published : Feb 20, 2021, 6:01 AM IST

Updated : Feb 20, 2021, 6:25 AM IST

ఈ నెల 23 వరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు నిర్ధారిస్తూ చేసిన ప్రకటనపై అధికారులు లేదా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలాంటి విచారణ జరపవద్దని హైకోర్టు ఆదేశించింది. ఫాం-10 ఇవ్వని చోట ఏదైనా చర్యలు తీసుకున్నా.. ఎన్నికల సంఘం కానీ జిల్లా కలెక్టర్లు కానీ ఈ నెల 23 వరకు వాటిని ప్రకటించొద్దని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వుల గురించి జిల్లా కలెక్టర్లందరికీ సమాచారం పంపాలని ఎన్నికల సంఘానికి సూచించింది.

విచారణ వాయిదా..

ఈ మేరకు పూర్థి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు శుక్రవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. బెదిరింపులు, దౌర్జన్యాల కారణంగా గతేడాది ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్‌ వేయలేనివారు, వేధింపులతో నామినేషన్‌ ఉపసంహరించుకున్న వారు ఆధారాలతో కలెక్టర్లను కలిసి ఫిర్యాదు చేసేందుకు ఎన్నికల సంఘం వెసులుబాటు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇలాంటి వారు గతంలో ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి ఈ నెల 20లోపు నివేదిక అందజేయాలని కలెక్టర్లను ఆదేశిస్తూ ఎన్నికల కమిషనర్ 18న ఉత్తర్వులిచ్చారు.

ఆ ఉత్తర్వులను సవాల్ చేశారు..

వాటిని సవాలు చేస్తూ.. చిత్తూరు జిల్లా ఆరడిగుంట, సింగిరిగుంట, పీలేరుకు చెందిన ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులు శుక్రవారం హైకోర్టులో అత్యవసరంగా రెండు వ్యాజ్యాలు దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ‘గతేడాది నిర్వహించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఒకే ఒక్క నామినేషన్‌ రావడంతో పిటిషనర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ధ్రువపత్రాలు (ఫాం 10) పొందారు.

'పిటిషన్‌ వేసుకోవడమే మార్గం'

ఎన్నికల సంఘం తాజా ఉత్తర్వులు చట్టవిరుద్ధం. నామినేషన్‌ ఒక్కటే వస్తే ఆ అభ్యర్థి ఎన్నికైనట్లు ఆర్‌వో తక్షణం ఉత్తర్వులివ్వాలి. వాటిని సమీక్షించే అధికారం ఎస్‌ఈసీకి ఉండదని కక్షిదారుల తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. పిటిషనర్ల తరఫు మరో న్యాయవాది వీఆర్‌ఎన్‌ ప్రశాంత్‌ వాదనలు వినిపిస్తూ.. ‘ ఓసారి అభ్యర్థి ఎన్నికైనట్లు ప్రకటించాక.. దానిని రద్దు చేయించాలంటే ఎన్నికల ట్రైబ్యునల్లో ‘ పిటిషన్‌ దాఖలు చేసుకోవడమే మార్గమని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు.

విచారణ జరపాలని మాత్రమే ఆదేశాలు..

ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్‌ వాదనలు వినిపిస్తూ.. ‘గతంలో చోటు చేసుకున్న దౌర్జన్యాలు, బెదిరింపుల విషయంలో అందిన ఫిర్యాదులపై విచారణ జరపాలని మాత్రమే కమిషనర్ కలెక్టర్లను ఆదేశించారు.

హడావుడిగా నివేదికలు ఎందుకు ?

ఈ దశలో పిటిషనర్లు వ్యాజ్యం దాఖలు చేయడానికి వీల్లేదు. సరైన ఆధారాలు లేని ఫిర్యాదులను కలెక్టర్లు పరిగణనలోకి తీసుకోరన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. చట్టంలో నిర్ధిష్టంగా పేర్కొనని అంశాల్లో మాత్రమే అధికరణ 243కే ప్రకారం అధికారాన్ని ఉపయోగించొచ్చని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. ఈ నెల 18న ఉత్తర్వులిచ్చి.. హడావుడిగా 20లోపు నివేదికలు పంపాలని కోరాల్సిన అవసరం ఏముందన్నారు. విచారణను ఆపాలని సూచించారు.

పొడిగించాలని వినతులు అందాయి..

ఫిర్యాదుల స్వీకరణ, విచారణ గడువును ఈ నెల 23 వరకు పొడిగించాలని వినతులు అందాయని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది కోరారు. పూర్తి వివరాలతో కౌంటర్‌ వేయడానికి గడువు కోరారు. ఇరువైపుల న్యాయవాదుల వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ఈ నెల 23 వరకు.. ఫాం 10 ఇచ్చినచోట విచారణ జరపవద్దని, ఇవ్వనిచోట చర్యలు తీసుకొని ఉన్నా వాటిని ప్రకటించొద్దని ఉత్తర్వులిచ్చారు.

ఇదీ చదవండి

ఎల్జీ పాలిమర్స్ ఘటన.. మానవహక్కుల ఉల్లంఘన : ఎన్​హెచ్ఆర్సీ

Last Updated : Feb 20, 2021, 6:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.