ETV Bharat / city

Black Funges: బ్లాక్​ఫంగస్ ఇంజెక్షన్లు ఎలా సరిపోతాయి? - high court latest news on block funges injections

బ్లాక్ ఫంగస్(Black Funges) చికిత్స నిమిత్తం రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తక్కువ ఇంజెక్షన్లు కేటాయించడంపై హైకోర్టు(High Court) అసంతృప్తి వ్యక్తంచేసింది. 13,830 ఇంజెక్షన్లు కేటాయిస్తే ఏవిధంగా సరిపోతాయని కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది సహాయ సొలిసిటర్ జనరల్ హరినాథ్​ను ప్రశ్నించింది. ఫంగస్ బాధితులకు కోర్సు ప్రకారం ఇంజెక్షన్లు వినియోగించాల్సి ఉంటుందని గుర్తుచేసింది. కరోనా చికిత్స పై హైకోర్టు(High Court)లో దాఖలైన వ్యాజ్యాలపై విచారణ జరిపింది. తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది.

హైకోర్టు
హైకోర్టు
author img

By

Published : Jun 4, 2021, 6:55 AM IST

బ్లాక్ ఫంగస్(Black Funges) చికిత్స చేసే ఇంజక్షన్ల కొరత ఏర్పడితే రాష్ట్రంలో 14 వందలకుపైగా ఉన్న బ్లాక్ ఫంగస్(Black Funges) బాధితుల పరిస్థితి ఏమిటని ధర్మాసనం ఆందోళన వ్యక్తంచేసింది. రాష్ట్రానికి ఎన్ని ఇంజెక్షన్లు కేటాయించబోతున్నారు ? ఏవిధంగా సరఫరా చేయనున్నారు తదితర వివరాల్ని తమ ముందు ఉంచాలని ఏఎస్పీని ఆదేశించింది. కరోనా మూడో దశ వ్యాప్తి పిల్లలపై ప్రభావం చూపుతుందనే వార్తల నేపథ్యంలో సన్నాహక చర్యలు ఏమి తీసుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వైద్య సిబ్బందిని పెంచేందుకు చర్యలెందుకు తీసుకోకూడదని వ్యాఖ్యానించింది. ఎంబీబీఎస్​, నర్సింగ్ కోర్సు తుది సంవత్సర విద్యార్థులు, టెక్నీషియన్లు, పారామెడికల్ సిబ్బందిని తాత్కాలికంగా నియమించే ఆలోచన చేయాలని సూచించింది.

అనంతపురంలో మాదిరి ప్రతి జిల్లాలో తాత్కాలిక ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని పేర్కొంది. వివరాలు సమర్పించాలని స్పష్టంచేస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. హైకోర్టు(High Court) న్యాయమూర్తులు జస్టిస్ కె.విజయలక్ష్మి, జస్టిస్ డి.రమేశ్​తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. కార్పొరేట్ ఆసుపత్రులను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని కరోనా చికిత్స అందించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ అఖిల భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుంకర రాజేంద్రప్రసాద్, కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పాత్రికేయులు తోట సురేశ్ బాబు మరికొందరు దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు(HighCourt) విచారణ చేపట్టింది.

అధిక రుసుముల కట్టడికి ఉత్తర్వులిచ్చారు: ఎస్​జీపీ

న్యాయస్థానం సూచన మేరకు ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక రుసుముల వసూలుకు కట్టడి దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్ వాదనలు వినిపించారు. కొవిడ్ బాధితుల నుంచి ప్రభుత్వం నిర్ణయించిన రుసుములను వసూలు చేస్తున్నారా లేదా అనే అంశాన్ని నోడల్ అధికారులు పరిశీలించాలన్నారు. ఆసుపత్రుల బిల్లులపై నోడల్ అధికారుల సంతకం తీసుకోవాలన్నారు. నోడల్ అధికారుల కౌంటర్ సంతకం తీసుకున్నాకే ఆసుపత్రులు సొమ్మును అంగీకరించాలన్నారు. సీనియర్ న్యాయవాది, అమికస్ క్యూరీ వైవీ రవి ప్రసాద్ స్పందిస్తూ .. ఉత్తర్వులు బాగానే ఉన్నాయికాని .. అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రభుత్వం వివిధ సందర్భాల్లో జారీచేసిన మార్గదర్శకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పత్రికలు, ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం పేర్కొంది.

ఆ ఇంజెక్షన్లు సరిపోవు: రాష్ట్ర ప్రభుత్వం

ఎస్​జీపీ వాదనలు వినిపిస్తూ.. బ్లాక్ ఫంగస్ (Black Funges) చికిత్స నిమిత్తం కేంద్ర ప్రభుత్వం ఏపీకి 13,830 యాంఫోటెరిసిస్ ఇంజెక్షన్లు కేటాయించిందన్నారు. అవి ఏమాత్రం సరిపోవన్నారు . తయారీ సంస్థల నుంచి నేరుగా కొనుగోలుకు ఇప్పటికే విజ్ఞప్తి చేశామన్నారు. ఇతర రాష్ట్రాల అవసరాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఇంజెక్షన్ల సరఫరాను నిలువరిస్తుందన్నారు. రాష్ట్రంలో సుమారు 1400 మందికి పైగా బ్లాక్ ఫంగస్ బాధితులున్నారన్నారు. 55 మరణాలు సంభవించాయన్నారు. 19 ఆసుపత్రలను చికిత్స కోసం గుర్తించామన్నారు . ఫంగస్ బాధితులకు 15 రోజులపాటు రోజుకు నాలుగైదు ఇంజెక్షన్లు ఇవ్వాలన్నారు. అమికస్ క్యూరీ వాదనలు వినిపిస్తూ ..బాధితులు ఒక్కొక్కరికి 40 నుంచి 45 ఇంజెక్షన్లు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కేసుల సంఖ్య పెరిగితే పరిస్థితి అదుపుతప్పుతుందన్నారు. సరిపడినన్ని ఇంజెక్షన్లు కేటాయించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు.

డిమాండ్ ఎక్కువ...సరఫరా తక్కువ:

కేంద్రం తరపున ఏఎస్​జీ వాదనలు వినిపిస్తూ...'వివిధ రాష్ట్రాల్లోని ఫంగస్ కేసుల సంఖ్య ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఇంజెక్షన్లు కేటాయిస్తోంది . ఇంజెక్షన్ల ఉత్పత్తి దేశంలో తక్కువగా ఉంది. డిమాండ్ ఎక్కవ .. సరఫరా తక్కువగా ఉంది. వివరాలు సమర్పించడానికి వారం సమయం ఇవ్వండి ' అని కోరారు . అందుకు ధర్మాసనం నిరాకరించింది. శుక్రవారానికి వివరాలు సమర్పించాలంది . పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ .. ఎన్ -95 మాస్కులు ప్రభుత్వం ఉచితంగా ప్రజలకు ఇవ్వాలన్నారు.

ఇదీ చదవండి:

AP CM letter to All CMs: 'కరోనా టీకాల సరఫరాపై ఒకే గొంతుక వినిపిద్దాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.