ETV Bharat / city

'అమరావతి భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించే అధికారం మీకెక్కడిది' - అమరావతిలో పేదల ఇళ్ల స్థలాల వార్తలు

రాజధాని నిర్మాణానికి సమీకరించిన భూములను... ఇళ్ల స్థలాలకు కేటాయించే అధికారం ప్రభుత్వానికి ఎక్కడుందని హైకోర్టు ప్రశ్నించింది. అభివృద్ధి పనులు చేపట్టనప్పుడు... కేటాయింపులేంటని వ్యాఖ్యానించింది. సీఆర్డీఏ పరిధిలో లేనివారికి ఇళ్ల స్థలాలిస్తూ విడుదలైన జీవోను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై... హైకోర్టులో విచారణ జరిగింది.

high court question to govt where the right to allocate amaravati land to homesteads

author img

By

Published : Feb 28, 2020, 5:37 AM IST

Updated : Feb 28, 2020, 6:10 AM IST

రాజధాని పరిధిలో బయటి వారికి ఇళ్లస్థలాల కేటాయింపుపై హైకోర్టులో వాదనలు జరిగాయి. అమరావతి నిర్మాణానికి రైతుల నుంచి సమీకరించిన భూమిని... ఇళ్ల స్థలాలకు కేటాయించే అధికారం ప్రభుత్వానికి ఎక్కడిదని ధర్మాసనం ప్రశ్నించింది. అభివృద్ధి పనులు చేపట్టాకే... సమీకరించిన భూముల్లో 5 శాతం భూమిని పేదలకు కేటాయించాలని సీఆర్డీఏ నిబంధనలు చెబుతున్నాయని గుర్తు చేసింది. అభివృద్ధి పనుల బాధ్యత నిర్వర్తించకుండా... ఏకపక్ష చర్యలు తీసుకోజాలదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రభుత్వ చర్యలు సీఆర్డీఏకి విరుద్ధమని పేర్కొంది.

'అమరావతి భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించే అధికారం ఎక్కడుంది'

రాజధానిలో పరిధిలోని లేని గ్రామాల పేదల కోసం

అమరావతి నిర్మాణానికి సమీకరించిన భూమిలో... రాజధాని పరిధిలో లేని గ్రామాల పేదలకు ఇళ్ల స్థలాల కోసం... వెయ్యీ 251 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం ఈనెల 25న జీవో ఇచ్చింది. గుంటూరు జిల్లా తాడేపల్లి, పెదకాకాని, మంగళగిరి, దుగ్గిరాల మండలాలు సహా... విజయవాడ పరిధిలో కలిపి మొత్తం 54 వేల 307 మందికి స్థలాలు కేటాయింపుపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాల కేటాయింపును ఏ విధంగా సమర్థించుకుంటారో తెలియజేస్తూ సోమవారం నాటికి ప్రమాణపత్రం దాఖలు చేయాలని.... ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశిస్తూ విచారణను మార్చి 4వ తేదీకి వాయిదా వేసింది. ఆలోపు లబ్ధిదారులకు ప్రభుత్వం పట్టాలిస్తుందేమోనని పిటిషనర్ల తరపు న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. మార్చి 25కి ముందుగా పట్టాలు ఇవ్వడం లేదని ఏజీ స్పష్టం చేశారు.

తుది నోటిఫికేషన్ ఇవ్వకుండానే...

సీఆర్డీఏ చట్టం ప్రకారం 5 శాతం భూమిని పేదలకు ఇళ్ల కోసం ఇవ్వవచ్చని ఏజీ(అడ్వొకేట్ జనరల్) వివరించారు. ఆ వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ... భూసేకరణ ద్వారా, లేదా ప్రభుత్వ భూములను గుర్తించి.... ఎవరికైనా ఇళ్ల స్థలాలు ఇవ్వవచ్చని సూచించింది. రాజధానిలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నప్పుడు మాత్రమే 5 శాతం భూమిని ఇళ్ల నిర్మాణానికి పరిశీలించవచ్చని పేర్కొంది. అభివృద్ధి పనులు చేపట్టకుండా... తుది నోటిఫికేషన్ ఇవ్వకుండా.... భూకేటాయింపు గురించి ఎందుకు ఆలోచిస్తున్నారని ప్రశ్నించింది.

ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న ఇళ్ల స్థలాలు మొదటి కేటాయింపులు కాదని... ఏజీ వివరించారు. 2017లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 7 వేల మంది లబ్ధిదారులను గుర్తించి సీఆర్డీఏ పరిధిలో 10 ప్రాంతాల్లో 5 వేల 300 ఇళ్లు నిర్మించారన్నారు. 2050 నాటికి అమరావతి ప్రజారాజధాని కావాలంటే 35 లక్షల జనాభా ఉండాలని... బయటి నుంచి తరలివస్తేనే పెరుగుతుందని వాదించారు. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని కోరిన ఏజీ... పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామన్నారు. ధర్మాసనం అందుకు అంగీకరించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం వివరాలు సమర్పించాలని... కేంద్రం తరఫు న్యాయవాదిని ఆదేశించింది.

ఇదీ చదవండి :

విశాఖ ఘటనపై కేసులు నమోదు చేయని పోలీసులు

Last Updated : Feb 28, 2020, 6:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.