ETV Bharat / city

వర్సిటీల్లో పాలకమండలి సభ్యులను ఏ విధంగా నియమిస్తారు?: హైకోర్టు

రాజకీయ ప్రయోజనాల ఆధారంగానే యూనివర్సిటీల్లో పాలకమండలిని నియమిస్తున్నారంటూ హైకోర్టులో న్యాయవాది నిమ్మిగ్రేస్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిల్​పై నేడు ధర్మాసనం విచారణ జరిపింది.

వర్సిటీల్లో పాలకమండలి సభ్యులను ఏ విధంగా నియమిస్తారు?: హైకోర్టు
వర్సిటీల్లో పాలకమండలి సభ్యులను ఏ విధంగా నియమిస్తారు?: హైకోర్టు
author img

By

Published : Nov 9, 2020, 5:03 PM IST

రాజకీయ ప్రయోజనాల ఆధారంగానే యూనివర్సిటీల్లో పాలకమండలిని నియమిస్తున్నారంటూ హైకోర్టులో న్యాయవాది నిమ్మిగ్రేస్ దాఖలు చేసిన పిల్​పై విచారణ జరిగింది. అన్ని యూనివర్శిటీల్లో పాలకమండలి సభ్యులను నియమించేందుకు నేతలు సిఫార్సులు చేస్తున్నారని న్యాయవాది శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. సిఫార్సులకు సంబంధించిన ఫైల్ వివరాలను ధర్మాసనం ముందుంచారు. వాదనలు విన్న ధర్మాసనం పాలకమండలి సభ్యులను ఏ విధంగా నియమిస్తారు? నిబంధనలు ఎలా ఉంటాయని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా న్యాయవాది శ్రవణ్ కుమార్​ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 23వ తేదీకి వాయిదా వేసింది.

ఇదీ చదవండి: సోమశిల హైలెవల్‌ కెనాల్‌ రెండో దశ పనులకు సీఎం శంకుస్థాపన

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.