తితిదే ఆస్తులను కాపాడాలని న్యాయవాది యలమంజుల బాలాజీ.. హైకోర్టులో వేసిన పిటిషన్పై విచారణ జరిగింది. తితిదేకు చెందిన స్థిర, చర ఆస్తుల జాబితాను పబ్లిక్ డొమైన్లో ఉంచాలని న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. ఆస్తులను అమ్మేందుకు తితిదేకు అధికారం లేదని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.
ఆస్తుల వివరాలను ఇప్పటికే పబ్లిక్ డొమైన్లో పెట్టినట్లు.. తితిదే తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. ఆస్తుల పరిరక్షణ కోసం హైకోర్టు మాజీన్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిటీ నియమించినట్లు వివరించారు. తితిదేకు చెందిన ఆస్తుల వివరాలు, పబ్లిక్ డొమైన్లో పెట్టిన ఆస్తుల వివరాలు, ఆస్తుల పరిరక్షణకు నియమించిన కమిటీ వివరాలను.. అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని తితిదేను న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను 5 రోజులకు వాయిదా వేసింది.
ఇదీ చదవండి: పుర ఎన్నికల్లో పోటీకి అనుమతివ్వాలని హైకోర్టులో పిటిషన్