ETV Bharat / city

అనుమతులిచ్చిన అధికారులను ఈ కేసులో ఎందుకు చేర్చొద్దు?:హైకోర్టు

స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనలో రమేష్ ఆసుపత్రి ఎండీ డా. రమేష్ బాబు, ఛైర్మన్ సీతారామమోహన్​లకు హైకోర్టులో ఊరట లభించింది. అగ్నిప్రమాద ఘటనలో తమపై పెట్టిన కేసును ఎత్తివేయాలని కోరుతూ ఎండీ, ఛైర్మన్​ వేర్వేరుగా దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లతో తదుపరి చర్యలను నిలువరిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.

high court on ramesh hospital issue
high court on ramesh hospital issue
author img

By

Published : Aug 25, 2020, 3:09 PM IST

Updated : Aug 25, 2020, 4:50 PM IST

స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనలో రమేష్ ఆసుపత్రి ఎండీ డా. రమేష్ బాబు, ఛైర్మన్ సీతారామమోహన్ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లపై ఈ రోజు విచారణ జరిగింది. స్వర్ణ ప్యాలెస్ కొన్నేళ్లుగా నగరంలో హోటల్​గా కొనసాగుతుందని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది దుమ్మాలపాటి శ్రీనివాస్ వాదించారు. స్వర్ణప్యాలెస్​లో కొవిడ్ కేర్ సెంటర్ నిర్వహించేందుకు జిల్లా వైద్యాధికారి అనుమతినిచ్చినట్లు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. గతంలో ఈ హోటల్​లో ఎయిర్ పోర్ట్ క్వారంటైన్ నిర్వహించారని తెలిపారు. కొవిడ్ కేంద్రంలో జరిగిన ప్రమాద ఘటనతో రమేశ్ ఆసుపత్రి యాజమన్యానికి సంబంధం లేదన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని న్యాయవాది శ్రీనివాస్​ కోరారు.

ఈ విచారణలో భాగంగా ధర్మాసనం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. కొవిడ్ కేర్ సెంటర్ నిర్వహించేందుకు కలెక్టర్, సబ్ కలెక్టర్ అనుమతినిచ్చారు కదా? వారిని ఈ కేసులో ఎందుకు చేర్చకూడదు? అని ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం కోరింది. కేసు ఇంకా విచారణలో ఉందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఈ సమయంలో ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని అభ్యర్ధించారు. ఇరువురి వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఆసుపత్రి యాజమాన్యంపై నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.

విజయవాడ స్వర్ణప్యాలెస్​లో ఈ నెల 9వ తేదీన తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనపై గవర్నర్​పేట్​ పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదైన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి: భారత్‌లో రెండోదశకు ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌

Last Updated : Aug 25, 2020, 4:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.