ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను అకస్మికంగా బదిలీ చేసిన నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ అధికారుల విషయంలో కనీస పదవీ కాల భద్రత రెండేళ్లు కల్పించేలా ఆదేశించాలని కోరుతూ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. కనీస పదవీ కాలం పూర్తి కాకముందే తనను బదిలీ చేశారని పూర్వ సీఎస్ సుబ్రహ్మణ్యం భావిస్తే హైకోర్టును ఆశ్రయించడానికి వెసులుబాటు ఉందని గుర్తు చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం కనీస పదవీకాల భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుందో తెలుసుకోవాలంటే సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకోవచ్చని సూచించింది. అంతేకాని పిల్ దాఖలు చేసి సుప్రీం మార్గదర్శకాల అమలుకు ఏమి చర్యలు తీసుకున్నారో చెప్పాలని... ప్రభుత్వాన్ని సమాచారం కోరాలనడం సరికాదని స్పష్టం చేసింది. పిల్ దాఖలు చేయడం వెనుక సదుద్దేశం లేదని పేర్కొంటూ జోక్యానికి నిరాకరించింది.
ఇవీ చూడండి: