పోలీసులు పలువుర్ని అక్రమంగా నిర్బంధంలోకి తీసుకున్న ఘటనల్లో ఆ వ్యక్తుల్ని కోర్టులో హాజరుపరిచేలా ఆదేశాలు జారీచేయాలని అభ్యర్థిస్తూ దాఖలైన పలు హెబియస్ కార్పస్ పిటిషన్లపై హైకోర్టు విచారణ జరుపుతోంది. పోలీసుల తరఫున సీనియర్ కౌన్సెల్ వాదనలు వినిపించారు. తదుపరి విచారణను ఒకటి, రెండు రోజులు వాయిదా వేయాలని ఆయన కోరగా ధర్మాసనం నిరాకరించింది. రోజువారీ విచారణ జరుపుతున్న నేపథ్యంలో గడువు ఇవ్వలేమని తేల్చి చెప్పింది.
ఇదీ చదవండి: ఎన్నికలకు మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలి: చంద్రబాబు