ఫైబర్ నెట్ తొలిదశ టెండర్ల వ్యవహారంలో సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ టెరా సాఫ్ట్ వేర్ సంస్థ ఎండీ గోపిచంద్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు .. సీఐడీకి నోటీసులు జారీచేసింది. కౌంటర్ వేయాలని ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
అంతకు ముందు పిటిషనర్ పై తప్పుడు కేసు పెట్టారని.. ఆయన తరపు న్యాయవాది వాదించారు. టెండర్ ప్రక్రియ పారదర్శకంగా(high court on fibernet tenders case) జరిగిందన్నారు. ఆరేళ్ల తర్వాత కేసు నమోదు చేయడం కక్ష సాధించడం కోసమేనన్నారు. పిటిషనర్ ఇప్పటికే ముందస్తు బెయిలు కోసం వ్యాజ్యం దాఖలు చేశారని.. సీఐడీ తరపు న్యాయవాది వాదించారు. అరెస్ట్ తో పాటు తొందరపాటు చర్యలు వద్దని న్యాయస్థానం ఉత్తర్వులిచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత వ్యాజ్యంలో తాము కౌంటర్ వేసేందుకు నాలుగు వారాలు సమయం ఇవ్వాలని కోరారు.
ఇదీ చదవండి: