High court On Dhulipalla Trust: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలో ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్టు వ్యవహారంపై హైకోర్టు విచారణ జరిపింది. ట్రస్టును దేవాదాయ చట్ట ప్రకారం రిజిస్ట్రర్ చేసుకోవాలంటూ.. ఇచ్చిన నోటీసుపై అభ్యంతరాలను రెండు వారాల్లో అధికారులకు సమర్పించాలని మేనేజింగ్ ట్రస్టీ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ను న్యాయస్థానం ఆదేశించింది. నోటీసును సవాలు చేస్తూ దాఖలు చేసిన రెండు వ్యాజ్యాలను కోర్టు కొట్టేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం. వెంకటరమణ ఈమేరకు నిర్ణయాన్ని వెల్లడించారు.
ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్టును దేవాదాయ చట్ట ప్రకారం నమోదు చేసుకోవాలంటూ.. ఆశాఖ కమిషనర్ జనవరి 5న నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులను సవాలు చేస్తూ.. మేనేజింగ్ ట్రస్టీ ధూళిపాళ్ల నరేంద్రకుమార్, మరో ఇద్దరు ట్రస్టీలు హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు వేశారు. పాల ఉత్పత్తిదారుల ప్రయోజనాల కోసం ట్రస్టును ఏర్పాటు చేశామని.. ఆ ట్రస్టు దేవాదాయ చట్ట ప్రకారం ' ఛారిటబుల్ సంస్థ ' అనే నిర్వచనం కిందకు రాదన్నారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయమూర్తి ఇటీవల తీర్పును రిజర్వు చేశారు. బుధవారం నిర్ణయాన్ని వెల్లడిస్తూ.. నోటీసుపై అభ్యంతరాలను రెండు వారాల్లో అధికారులకు సమర్పించాలని ట్రస్టీ మేనేజింగ్ ట్రస్టీని ఆదేశించారు.
ఇదీ చదవండి: