ETV Bharat / city

చిలకలూరిపేటలో ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా - చిలకలూరిపేట మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా న్యూస్

Gnt_Chilakaluripeta Green signal_Breaking

author img

By

Published : Mar 9, 2021, 3:33 PM IST

Updated : Mar 9, 2021, 7:52 PM IST

15:30 March 09

ఎన్నికల ఫలితాలు మాత్రం ప్రకటించవద్దు

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఎన్నికల లెక్కింపు అనంతరం విజేత తుది ప్రకటన కోర్టు పరిధికి లోబడి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. పసుమర్రు, గణపవరాన్ని చిలకలూరిపేట పురపాలికలో విలీనంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 15, 16న తదుపరి విచారణ ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. 

చిలకలూరిపేట పురపాలక సంఘంలో గణపవరం, పసుమర్రు మేజరు పంచాయతీలను ప్రభుత్వం విలీనం చేసింది. అయితే రెండు గ్రామాల్లో ఆశించిన అభివృద్ధి, ప్రజలకు ఉపాధి లేకపోవడం వంటి కారణాలతో విలీన ప్రక్రియపై ఇద్దరు న్యాయవాదులు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గ్రామ సభ తీర్మానం లేకుండా విలీన ప్రక్రియ నిర్వహించారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం ఇచ్చిన విలీన ఉత్తర్వులపై న్యాయస్థానం స్టే విధించింది. విలీన సమయంలో పంచాయతీ దస్త్రాలు పురపాలక సంఘానికి చేరాయి. ఆ తర్వాత పది రోజుల్లోనే ఇవి పంచాయతీలకు తిరిగొచ్చాయి. న్యాయస్థానం స్టే అమల్లో ఉందన్న కారణంగా పంచాయతీ ఎన్నికలు ఇక్కడ నిర్వహించలేదు. తిరిగి పురపాలక ఎన్నిక ప్రక్రియను చేపట్టడంతో ప్రజల్లోనూ గందరగోళ పరిస్థితికి దారితీసింది.

పురపాలక ఎన్నికల షెడ్యూలు జారీకి ముందే విలీనం చేసుకున్న ఈ పంచాయతీల్లో పురపాలక వార్డుల విభజన, వాటికి రిజర్వేషన్లు ఖరారు చేశారు. గణపవరంలో ఐదు, పసుమర్రులో రెండు, మరో విలీన గ్రామం మానుకొండవారిపాలెంలో ఒక వార్డు ఉండేలా విభజన చేశారు. పసుమర్రు, గణపవరాన్ని చిలకలూరిపేట పురపాలికలో విలీనంపై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. తదుపరి విచారణను ఈ నెల 15, 16కు వాయిదా వేసింది. ఈ వివాదం కోర్టు పరిధిలో ఉండటంతో ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న సందిగ్ధంతో అభ్యర్ధులు అంతంత మాత్రంగానే ప్రచారం చేశారు. తాజాగా హైకోర్టు తీర్పుతో అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు.
 
ఇదీ చదవండి: స్టీల్​ ప్లాంట్​పై మరోసారి ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ

Last Updated : Mar 9, 2021, 7:52 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.