రాజధానికి సంబంధించిన వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ జరిగింది. రోజువారీ విచారణలో భాగంగా త్రిసభ్య బెంచ్ వ్యాజ్యాలపై విచారణ జరిపింది. రైతుల తరపున ఉన్నం మురళీధర్ రావు వాదనలు వినిపించారు. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలు తీసుకురావడం రాజ్యాంగ విరుద్ధమని.. దీనివల్ల రైతుల ప్రాధమిక హక్కులకు భంగం వాటిల్లుతుందని మురళీధర్ వాదించారు.
జీఎన్ రావు, బోస్టన్, హైపవర్ కమిటీ నివేదికల ఆధారంగా నూతన చట్టాలు తెచ్చారని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. నూతన చట్టం తీసుకురావాలని నివేదికల్లో సూచించారా ? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఆర్టికల్ 37, 38 ప్రకారం డీసెంట్రలైజేషన్ చేస్తున్నామని ప్రభుత్వం న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
ఇవీ చదవండి...