మందడం పరిధిలో ఇసుకను నిల్వ చేసే ప్రక్రియ ఇంకా ప్రారంభించలేదని అమరావతి మహానగర ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(AMRDA) హైకోర్టుకు నివేదించింది. పిటిషనర్ కోర్టు ముందు ఉంచిన ఫోటో మందడం గ్రామ పరిధిలోని పది ఎకరాల్లో ఇసుక నిల్వ చేసేందుకు లీజుకిచ్చిన సైట్‌వి కాదన్నారు. కృష్ణా నది నుంచి తవ్వి తీసిన ఇసుక వర్షాకాలంలో మళ్లీ నదిలోకి చేరకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇసుక ఎండిన తర్వాత వేరే ప్రాంతానికి తరలిస్తున్నామన్నారు. ఆ వివరాల్ని అఫిడవిట్ రూపంలో వేయాలని ఆదేశించిన హైకోర్టు.. విచారణను దసరా సెలవుల తర్వాత చేపడతామని పేర్కొంది. కృష్ణా నదిలో పూడిక తీసిన ఇసుకను రాజధాని ప్రాంతం మందడం గ్రామ పరిధిలోని పది ఎకరాల్లో నిల్వ చేసేందుకు అధికారులు లీజు ప్రాతిపదికన అనుమతించడాన్ని సవాలు చేస్తూ రాజధాని రైతు పరిరక్షణ సమితి హైకోర్టులో పిల్(high court on amrda sand storage issue pil) వేశారు.
ఇదీ చదవండి: