రాజధానిపై కేసులు వాదించేందుకు రోహత్గీకి రూ.5 కోట్ల ఫీజును ప్రభుత్వం చెల్లించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. నిబంధనలకు విరుద్ధంగా రూ.కోటి అడ్వాన్స్ ఇచ్చారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ కేసులో ప్లానింగ్ శాఖ కార్యదర్శితో పాటు ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చారు. పిటిషనర్ వాదనలు విన్న న్యాయస్థానం... ఏ రిఫరెన్స్ మీద జీవో విడుదల చేశారో చెప్పాలని ప్రభుత్వ వివరణ కోరింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: