రాజధాని భూములపై వాదనలు వినిపించేందుకు తనకు అవకాశమివ్వాలని న్యాయవాది మమతారాణి వేసిన పిటిషన్పై విచారణ ఈ నెల 29కి వాయిదా పడింది. అంతకు ముందు మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ తరఫు న్యాయవాది ప్రణతి వాదనలు వినిపిస్తూ ... కౌంటర్ దాఖలు చేయడానికి సోమవారం వరకు సమయం కావాలన్నారు. ప్రభుత్వ న్యాయవాది సుమన్ వాదనలు వినిపిస్తూ .. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేసిందన్నారు. వచ్చే వారం విచారణకు వచ్చే అవకాశం ఉందన్నారు. మంగళవారం తగిన ఉత్తర్వులు ఇస్తామని పేర్కొంటూ విచారణను ప్రధాన న్యాయమూర్తి వాయిదా వేశారు.
అనుబంధ పిటిషన్పై విచారణ 29కి వాయిదా - అమరావతి భూములపై ఏసీబీ కేసులు న్యూస్
రాజధాని భూములకు సంబంధించి అవినీతి నిరోధక శాఖ నమోదు చేసిన కేసులో ఈ నెల 15న హైకోర్టు జారీచేసిన ఉత్తర్వులను సవరించాలని న్యాయవాది మమతారాణి కోరారు. తనను ప్రతివాదిగా చేర్చుకొని వాదనలు వినిపించేందుకు అవకాశమివ్వాలని కోరుతూ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్పై విచారణ ఈ నెల 29 కి వాయిదా పడింది.