ETV Bharat / city

ఆర్టీపీసీఆర్‌ పరీక్షల నిర్వహణ తీరుపై.. తెలంగాణ హైకోర్టు అసంతృప్తి - high court on corona guidelines

ఆర్టీపీసీఆర్‌ పరీక్షలపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా నిబంధనలు పాటించని వారిపై చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయని వ్యాఖ్యానించింది.కరోనా పరీక్షలను కేంద్రం మార్గదర్శకాల ప్రకారం 70 శాతానికి పెంచాలని సూచించింది. సీరో సర్వైలెన్స్ ఆరు వారాల్లో పూర్తి చేస్తామని ప్రభుత్వం తెలపగా.. నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.

ఆర్టీపీసీఆర్‌ పరీక్షలపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి

author img

By

Published : Apr 8, 2021, 4:43 PM IST

తెలంగాణలో కరోనా నిబంధనలు పాటించని వారిపై చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయని ఆ రాష్ట్ర హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా పరీక్షలు, చికిత్సలపై వైద్యారోగ్యశాఖ, కరోనా మార్గదర్శకాల అమలుపై డీజీపీ వేర్వేరుగా నివేదికలు సమర్పించగా.. హైకోర్టు విచారణ జరిపింది.

పాతబస్తీకి వెళ్లి చూడండి..

రాష్ట్ర వ్యాప్తంగా కేవలం లక్షా16 వేల మందికే జరిమానా విధించారనే వివరాలపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పాతబస్తీ వంటి ప్రాంతాల్లో రెండు రోజులు తనిఖీ చేస్తే లక్ష మంది దొరుకుతారని వ్యాఖ్యానించింది. నిబంధనల ఉల్లంఘనలపై సుమారు 22 వేలు, భౌతిక దూరం పాటించని వారిపై 2,416, రోడ్లపై ఉమ్మిన వారిపై ఆరు కేసులు నమోదు చేశామని.. డీజీపీ ఉన్నత న్యాయస్థానానికి నివేదించారు.

కరోనా టెస్టులు పెంచండి..

ఆర్టీపీసీఆర్​ పరీక్షలు చాలా తక్కువగా చేస్తున్నారని మరోసారి హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం 70 శాతానికి పెంచాలని సూచించింది. సీరో సర్వైలెన్స్ ఆరు వారాల్లో పూర్తి చేస్తామని ప్రభుత్వం తెలపగా.. నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. లాక్‌డౌన్ లేకపోయినా.. కంటైన్‌మెంట్ జోన్లు కచ్చితంగా ఉండాలని ఉన్నత న్యాయస్థానం తెలిపింది.

కరోనా వనరులుగా మద్యం దుకాణాలు

మద్యం దుకాణాలు, పబ్‌లు, థియేటర్లలో రద్దీపై ఆందోళన వెలిబుచ్చింది. మద్యం దుకాణాలు కరోనా వనరులుగా మారాయని వ్యాఖ్యానించింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కరోనా పరీక్షలు చేయాలని స్పష్టం చేసింది. నిపుణులతో సలహా కమిటీ ఏర్పాటు చేయాలన్న హైకోర్టు.. ప్రభుత్వ, ప్రైవేట్, కార్యాలయాల్లో వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు ఏమిటో చెప్పాలని పేర్కొంది. ఈ నెల 14లోగా నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ విచారణ 19కి వాయిదా వేసింది.

ఇదీ చూడండి:

శ్రీశైలానికి కన్నడ భక్తుల తాకిడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.