స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో మరోసారి వాదనలు జరిగాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో సుమారు 59.85 శాతం రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.... తీర్పును రిజర్వ్ చేసింది. అయితే ఇవాళ మరోసారి వాదనలు విన్న హైకోర్టు.... మరోసారి తీర్పును రిజర్వ్ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని.... అయితే ప్రభుత్వం తమ వాదనను సమర్థించుకునేందుకు ప్రత్యేక పరిస్థితుల అంశాన్ని తెరపైకి తీసుకువస్తుందని పిటిషనర్ తరఫు న్యాయవాది అన్నారు.
ఇవీ చదవండి: అమెరికాలో భారతీయ విద్యార్థులు ఇంతమంది ఉన్నారా?