నిబంధనలు పాటించని ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని హైకోర్టు తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా వార్షికోత్సవాల పేరుతో ప్రైవేటు విద్యాసంస్థలు డబ్బులు వసూలు చేస్తున్నారంటూ దాఖలైన వ్యాజ్యంపై ధర్మాసనం విచారణ చేపట్టింది.
కొన్ని ప్రైవేటు స్కూల్స్ వార్షికోత్సవాలకు విద్యార్థుల నుంచి ఫీజులు తీసుకుంటున్నారంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రవణ్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కోర్టు ఆదేశాలు అమలు చేయని పాఠశాలల వివరాలు తమ ముందు ఉంచాలని న్యాయస్థానం పిటిషనర్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.
ఇవీ చదవండి...
పాలకులు చేసిన పాపాలు.. పట్టిసీమ నీళ్లు చల్లుకుని కడుక్కోవాలి: దేవినేని