హైకోర్టు, న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ హైకోర్టుకు నివేదిక సమర్పించింది. ఈ కేసులో ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేశామని సీబీఐ తరఫు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. నిందితులు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్నారని.. వారిని అదుపులోకి తీసుకుని విచారించేందుకు 4 నెలల సమయం పడుతుందని విన్నవించారు. సీబీఐకు ఆ సమయం ఇవ్వాలని కోర్టును కోరారు. దీనిపై తదుపరి విచారణను వచ్చే ఏడాది మార్చి 31కు హైకోర్టు వాయిదా వేసింది.
ఇవీ చదవండి..
తన వారి కోసమే ఉపాధ్యాయ బదిలీలకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహణ: అచ్చెన్నాయుడు