ETV Bharat / city

'డెయిరీని స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి లేదు' - హైకోర్టులో సంగం డెయిరీపై విచారణ వార్తలు

సంగం డెయిరీని స్వాధీనం చేసుకొనే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని డెయిరీ డైరెక్టర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు హైకోర్టులో వాదనలు వినిపించారు. ఈ మేరకు ఇచ్చిన జీవో అమలును నిలుపుదల చేయాలని, డెయిరీ కార్యకలాపాల్లో అధికారుల జోక్యాన్ని నిలువరించాలని అభ్యర్థించారు.

'డెయిరీని స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి లేదు'

author img

By

Published : May 4, 2021, 4:49 AM IST

సంగం డెయిరీని స్వాధీనం చేసుకొనే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, ఈ మేరకు ప్రభుత్వం ఇచ్చిన జీవో అమలును నిలుపుదల చేయాలని.. డెయిరీ డైరెక్టర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు హైకోర్టులో వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. ప్రజా ప్రయోజనం దృష్ట్యా జీవో జారీచేశామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఆస్తుల దుర్వినియోగం చేస్తున్నారన్న కారణంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నామన్నారు. సోమవారం విచారణలో ఇరువైపు న్యాయవాదుల వాదనలు ముగియడంతో మధ్యంతర ఉత్తర్వులపై నిర్ణయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు వాయిదా వేశారు. సంగం డెయిరీని ఆంధ్రప్రదేశ్‌ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ (ఏపీడీడీసీ)/ప్రభుత్వ పరిధిలోకి తీసుకుంటూ, నిర్వహణ బాధ్యతను తెనాలి సబ్‌కలెక్టర్‌కు అప్పగిస్తూ ఈ నెల 27న జీవో 19ని జారీచేశారు. దాన్ని సవాలు చేస్తూ సంగం మిల్క్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎస్‌ఎంపీసీఎల్‌) డైరెక్టర్‌ వి.ధర్మారావు హైకోర్టులో వ్యాజ్యం వేశారు.
యథావిధిగా సంగం డెయిరీ కార్యకలాపాలు
సంగం డెయిరీ కార్యకలాపాలు యథావిధిగా జరుగుతున్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ కోఆపరేటివ్‌ ఫెడరేషన్‌ (ఏపీడీడీసీఎఫ్‌) ఎండీ అహ్మద్‌ బాబు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. దాదాపు లక్ష మంది పాల ఉత్పత్తిదారులకు రూ.14 కోట్ల బకాయిలు చెల్లించామన్నారు. 771 మంది శాశ్వత ఉద్యోగులకు ఏప్రిల్‌ జీతాలు చెల్లించామని, 415 మంది ఒప్పంద ఉద్యోగులకు మంగళవారం ఇస్తామని తెలిపారు.

ఇదీ చదవండి: వివాహ బంధానికి ముగింపు పలికిన బిల్​గేట్స్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.