ETV Bharat / city

పిటిషన్లపై పదే పదే వాయిదాలు సరికాదు: హైకోర్టు - ఏపీ హైకోర్టు లెటెస్ట్ న్యూస్

హెబియస్ కార్పస్ పిటిషన్లపై పదేపదే వాయిదాలు అడగటం సరికాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. విచారణపై అభ్యంతరం ఉంటే సుప్రీం కోర్టు వెళ్లాలని సూచించింది. పోలీసులు అక్రమంగా నిర్బంధించారని హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై రోజువారీ విచారణ జరుగుతోంది. పోలీసుల తరఫున వాదిస్తున్న న్యాయవాది విచారణను వాయిదా వేయాలని కోర్టును కోరారు. వాయిదా కోరటంపై కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. వాదనలు వినిపించేందుకు పోలీసులు సిద్ధంగా లేరని భావించాల్సి వస్తుందని హైకోర్టు తెలిపింది.

High court
High court
author img

By

Published : Nov 18, 2020, 5:17 PM IST

పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నప్పుడు వాయిదా వేయమని పదేపదే అడగటం సరికాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. అభ్యంతరం ఉంటే సుప్రీం కోర్టుకు వెళ్లొచ్చని తెలిపింది. హైకోర్టులో దాఖలైన పలు హెబియస్ కార్పస్ పిటిషన్లపై విచారించిన హైకోర్టు ఈ వ్యాఖ్యాలు చేసింది. పోలీసులు అక్రమంగా నిర్బంధించారని హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతోంది.

ఈ సమయంలో పోలీసుల తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది ఎస్ఎస్ ప్రసాద్ విచారణను వాయిదా వేయాలని కోర్టును కోరారు. విచారణను పదే పదే వాయిదా వేయమనటం సరికాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మళ్లీ వాయిదా అడిగితే అంగీకరించలేమని.. అటువంటి పరిస్థితి వస్తే పోలీసు అధికారులు.. వాదనలు వినిపించేందుకు ముందుకు రావటంలేదని భావించాల్సి వస్తుందని కోర్టు తెలిపింది.

రాజ్యాంగ ప్రక్రియ ప్రకారం రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయా ? లేవా ? అనే విషయం వాదనలు వినిపించాలని పిటిషనర్ తరపు న్యాయవాది రవితేజను కోర్టు ఆదేశించింది. ఏజీ కూడా సహకరించి వాదనలు జరపాలని తెలిపింది. మిగిలిన న్యాయవాదులు సైతం తమ వాదనలు వినిపించవచ్చని ధర్మాసనం సూచించింది.

ఇదీ చదవండి:

డిసెంబర్​ ​25న ఇళ్ల స్థలాల పంపిణీ... సీఎం జగన్ కీలక నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.