ETV Bharat / city

'ఆ ఉత్తర్వులను ఉపహరించుకుని.. నూతన ఆదేశాలు జారీ చేశాం'

దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కార్యాలయాల కోసం అవసరమైన ఫర్నీచర్ , ఇతర అవసరాల కోసం 18 దేవాలయాల నుంచి నిధులను సమకూర్చాలంటూ ఇచ్చిన ఉత్తర్వులను ఉపహరించుకున్నట్లు దేవాదాయ కమిషనర్​.. హైకోర్టుకు నివేదించారు. ఈ నెల 21ను నూతన ఆదేశాలు జారీ చేశామన్నారు.

హైకోర్టు
హైకోర్టు
author img

By

Published : Apr 22, 2022, 4:59 AM IST

నూతనంగా ఏర్పాటుచేసిన జిల్లాలో దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కార్యాలయాల కోసం అవసరమైన ఫర్నీచర్ , ఇతర అవసరాల కోసం రాష్ట్రంలోని 18 దేవాలయాల నుంచి నిధులను సమకూర్చాలంటూ ఈనెల 15 న తాము ఇచ్చిన ప్రొసీడింగ్స్ ను ఉపసంహరించుకున్నట్లు దేవాదాయ కమిషనర్ హైకోర్టుకు నివేదించారు. పూర్వ ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నట్లు ఈనెల 21 న తాజాగా ప్రొసీడింగ్స్ ఇచ్చామన్నారు. ప్రభుత్వ న్యాయవాది దానిని కోర్టుకు సమర్పించారు. ఆ వివరాలను నమోదు చేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు వ్యాజ్యాన్ని పరిష్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

కొత్త జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయాలకు ఫర్నీచర్ కొనుగోలు , మరమ్మతులు , తదితర అవసరాలకు 18 దేవాలయాల నుంచి రూ .63 లక్షలు సమకూర్చాలని పేర్కొంటూ ఈనెల 15 న దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులిచ్చారు. దానిని సవాలు చేస్తూ విజయవాడకు చెందిన అవుటుపల్లి ప్రసాద్ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. దేవాలయాల చెందిన కామన్ గుడ్ ఫండ్ ను కేవలం దేవస్థానాల ఆధునికీకరణ , వేదపాఠ శాలల ఏర్పాటుకు మాత్రమే వినియోగించాలని.. గత విచారణలో న్యాయవాది ఫణిదత్ చైతన్య వాదనలు వినిపించారు. ఫర్నీచర్ కొనుగోలు , మరమ్మతులకు వినియోగించడానికి వీల్లేదన్నారు. తాజాగా జరిగిన విచారణలో దేవాదాయ కమిషనర్ ప్రొసీడింగ్స్ ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు నివేదించారు.

ఇదీ చదవండి: 'ఆ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.