High Court on MLA Udayabhanu Cases: ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై నమోదైన 10 కేసులు ఎత్తివేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. కేసులు ఎత్తివేసేటప్పుడు హైకోర్టు అనుమతి తీసుకున్నారా? అని ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. అనుమతి తీసుకోలేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఎమ్మెల్యే సామినేనిపై కేసులు ఎత్తివేయడంపై సామాజికవేత్త చెవుల కృష్ణాంజనేయులు పిటిషన్ దాఖలు చేశారు.
ప్రజాప్రతినిధుల మీద నమోదైన కేసును తొలగించాలంటే హైకోర్టు అనుమతి తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించిందని న్యాయమూర్తి వివరించారు. అనుమతి లేకుండా కేసులు ఎలా ఎత్తి వేస్తారని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులపై మొత్తం ఎన్ని కేసులు తొలగించారు. వాటిలో ఎన్ని కేసులకు హైకోర్టు అనుమతి తీసుకున్నారో పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.
ఇదీ చదవండి: