ETV Bharat / city

ఆ నోటీసులపై కౌంటర్ దాఖలు చేయాలని... సీఆర్డీఏ అధికారులకు హైకోర్టు ఆదేశాలు - అమరావతి రైతులకు సీఆర్డీఏ నోటీసుల వార్తలు

అమరావతి రైతులు స్థలాలు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలంటూ ఇచ్చిన నోటీసులపై కౌంటర్ దాఖలు చేయాలని... సీఆర్డీఏ, పురపాలకశాఖ అధికారులను హైకోర్టు ఆదేశించింది. విచారణను జూన్ 21 కి వాయిదా వేసింది. సీఆర్డీఏ నోటీసులను సవాల్‌ చేస్తూ కొండెపాటి గిరిధర్, మరొకరు హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

హైకోర్టు
హైకోర్టు
author img

By

Published : Apr 28, 2022, 3:49 AM IST

రాజధాని అమరావతికి భూములిచ్చినందుకు.. స్థలాలను(ప్లాట్లు) రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటూ ఏపీ సీఆర్డీఏ అధికారులు భూయజమానులకు ఇచ్చిన నోటీసును సవాలుచేస్తూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి , సీఆర్డీఏ కమిషనర్ , ఏపీసీఆర్డీఏ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ కు నోటీసులు జారీచేసింది. విచారణను జూన్ 21 కి వాయిదా వేసింది

సీఆర్డీఏ చట్టం ప్రకారం రైతులకిచ్చే ప్లాట్లకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని పిటిషనర్‌ వాదించారు. బదలాయింపు హక్కులతో సహా భూసమీకరణ యాజమాన్య ధ్రువీకరణ పత్రాలను.. ఇవ్వాల్సి ఉందన్నారు. ఆ పత్రాల్లో భూయజమాని పేర్లు, పునర్ నిర్మాణ ప్లాట్ల స్కెచ్ తదితర వివరాలుండాలన్నారు. ఈ ప్రక్రియ పూర్తిచేశాక ఎలాంటి రుసుము లేకుండా ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయాలని పేర్కొన్నారు. అందుకు భిన్నంగా ఉన్న సీఆర్డీఏ నోటీసుల అమలును నిలిపివేయాలని కోరారు. భూమికి సంబంధించిన అసలు దస్త్రాలు చూపించి..ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని మాత్రమే నోటీసిచ్చామని సీఆర్డీఏతరఫున న్యాయవాది వాదించారు. వాదనలు విన్ని న్యాయమూర్తి ప్రతివాదులకు నోటీసులు ఇచ్చారు.

ఇదీ చదవండి: ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు సీఆర్‌డీఏ నోటీసులు.. అమరావతి రైతుల అభ్యంతరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.