ETV Bharat / city

HIGH COURT: ఎయిడెడ్ సంస్థలకు సాయం నిలిపివేతపై కౌంటర్ వేయండి: హైకోర్టు - High Court hearing on aided educational institutions

ఎయిడెడ్ విద్యా సంస్థలపై హైకోర్టులో విచారణ

author img

By

Published : Sep 16, 2021, 1:44 PM IST

Updated : Sep 17, 2021, 3:10 AM IST

13:40 September 16

ప్రభుత్వం ఎయిడ్ ఉపసంహరణ నిర్ణయంపై దాఖలైన పిటిషన్లు

  ప్రైవేటు, ఎయిడెడ్‌ విద్యాసంస్థలకు ఆర్థిక సాయం నిలిపివేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో ఈ నెల 29లోపు కౌంటర్‌ వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి, జస్టిస్‌ ఎన్​.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. విచారణను అక్టొబర్ 4 కు వాయిదా వేసింది. ప్రైవేటు, ఎయిడెడ్‌ విద్యాసంస్థలకు(పాఠశాలలు, జూనియర్‌, డిగ్రీ కళాశాలలు) ఆర్థిక సాయం నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటిని ప్రైవేటుగా నిర్వహించుకోవాలని.. లేదంటే తమకు అప్పగించాలని సూచిస్తూ ఏపీ విద్యా చట్టానికి సవరించి ఈ నెల 6న ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. ఈ వ్యవహారంపై యాజమాన్యాల సమ్మతి తెలుసుకోవాలని కళాశాల విద్య కమిషనర్‌ను ఆదేశిస్తూ ఈ నెల 10న జీవో 42ను జారీచేసింది.

   ఆర్డినెన్స్‌, జీవోలను సవాల్‌ చేస్తూ.. కొందరు హైకోర్టులో వేరువేరుగా వ్యాజ్యాలు వేశారు. వ్యాజ్యాలు వేశారు. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు నర్రా శ్రీనివాసరావు, జె.సుధీర్‌, శ్రావణ్‌కుమార్‌, కేకే రావు వాదనలు వినిపించారు. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయిందన్నారు. ఆయా విద్యాసంస్థల సిబ్బంది, ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్నారు. ప్రభుత్వ నిర్ణయం 2 లక్షల మంది విద్యార్థులు, 2 వేల 500 మంది సిబ్బందిపై ప్రభావం చూపుతుందన్నారు. ప్రభుత్వం కౌంటర్ వేశాక లోతైన విచారణ జరుపుతామన్న ధర్మాసనం..... విచారణను అక్టొబర్ 4 కు వాయిదా వేసింది.

ఇదీచదవండి. 

మోదీ సర్కార్ దేశాన్ని హోల్​సేల్​గా అమ్మేస్తోంది: నారాయణ

Last Updated : Sep 17, 2021, 3:10 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.