ETV Bharat / city

పట్టా భూముల్లో ఇసుక తవ్వకాల జీవోపై  మద్యంతర ఉత్తర్వులు

పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలను నిలిపివేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నవంబర్ 12న జారీచేసిన జీవో 78 లోని మార్గదర్శకం 6(9) ని హైకోర్టు సస్పెండ్ చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.

author img

By

Published : Apr 9, 2021, 8:27 AM IST

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
జీవో 78 లోని మార్గదర్శకం 6(9)ను సస్పెండ్ చేసిన హైకోర్టు

పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలను నిలిపివేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నవంబర్ 12 న జారీచేసిన జీవో 78 లోని మార్గదర్శకం 6(9) ని హైకోర్టు సస్పెండ్ చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. 2019 సెప్టెంబర్ లో ఇచ్చిన రెండు జీవోల ప్రకారం పట్టా భూముల్లోని ఇసుక తవ్వకానికి అనుమతి ఉండేదని.. 2020 లో ఇచ్చిన జీవో 78 ద్వారా నాణ్యమైన ఇసుక సరఫరా పేరుతో పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలను నిలిపేశారని పేర్కొంటూ గుంటూరు జిల్లాకు చెందిన రవి జగ్జీవనరావు.. హైకోర్టును ఆశ్రయించారు. తన భూమిలో ఇసుక తవ్వకానికి అనుమతించేలా అధికారులను ఆదేశించాలని కోరారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి .. పలుమార్లు అవకాశం ఇచ్చినా అధికారులు కౌంటర్ దాఖలు చేయలేదని ఆక్షేపించారు.

ఇదీ చదవండి: ఇక నుంచి డిజిటల్ విధానంలో.. ధ్రువపత్రాల జారీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.