ఫైబర్ నెట్ తొలిదశ టెండర్ల వ్యవహారమై సీఐడీ నమోదు చేసిన కేసులో.. టెండర్ల సాంకేతిక మదింపు కమిటీలో అప్పట్లో సభ్యుడిగా ఉన్న వేమూరి హరికృష్ణ ప్రసాద్ కు.. హైకోర్టులో ఊరట లభించింది. ఆయన అరెస్ట్‌తో పాటు ఇతర తొందరపాటు చర్యలేమి తీసుకోవద్దని.. సీఐడీని హైకోర్టు ఆదేశించింది . సీఐడీ తరఫు న్యాయవాది వివరాలు సమర్పించడం కోసం విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత ఈ మేరకు ఆదేశాలిచ్చారు . సీఐడీ తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ హరికృష్ణ ప్రసాద్ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గంటా రామారావు వాదనలు వినిపించారు.
ఇదీ చదవండి:
TDP DECISIONS: రైతులు, నిరాశ్రయులను ప్రభుత్వం ఆదుకోవాలి: తెదేపా